Huge flood in Hussain Sagar.. GHMC warned people
mictv telugu

హుస్సేన్ సాగర్‌కు భారీ వరద.. ప్రజలను హెచ్చరించిన జీహెచ్ఎంసీ

July 13, 2022

ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలతో హైదరాబాద్ నగరం తడిసి ముద్దైంది. అనేక చోట్ల రోడ్లపై నీరు నిలిచిపోగా, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో సికింద్రాబాద్‌లో ఉన్న హుస్సేన్ సాగర్‌కు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు భారీగా తరలివస్తోంది. ఇప్పటికే నీరు 513 అడుగులకు చేరగా, పూర్తి సామర్ధ్యం 514 అడుగులుందని అధికారులు వెల్లడించారు. కేవలం ఒక్క అడుగు మాత్రమే తక్కువుండగా, జీహెచ్ఎంసీ లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అటు నగర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. జూన్ 1 నుంచి జూన్ 12 వరకు సరాసరిన 68 శాతం అధిక వర్షపాతం నమోదైంది. చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే 50 నుంచి 80 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. నగరానికి ఆనుకుని ఉన్న జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌లు నిండి తొణికిసలాడుతున్నాయి.