హైదరాబాద్‌లో కళ్లు తిరగే నగదు సీజ్ - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో కళ్లు తిరగే నగదు సీజ్

September 15, 2020

Huge hawala money rocket busted in Hyderabad

ఈ రోజు మధ్యాహ్నం.. హైదరాబాద్ రోడ్ నంబర్ 12లో ఓ కారు దర్జాగా వెళ్తోంది. పోలీసులు అడ్డకుని  డ్రైవర్‌ను, ముగ్గురు ప్రయాణికులను దిగమన్నారు. లోపలున్న వారికి విషయం అర్థమైంది. నోరుమూసుకుని కారు దిగారు. కారులో వెతికిన పోలీసులకు దిమ్మతిరిగింది. గుట్టలకొద్దీ నగదు కనిపించింది. అక్షరాలా రూ. 3.75 కోట్ల నగదు దొరికింది. 

ఈ భారీ హవాలా రాకెట్‌ను పోలీసులు పక్కా సమాచారంతో ఛేదించారు. కారులో నలుగురు భారీగా  హవాలా డబ్బు తరలిస్తున్నట్లు ఉప్పు అందడంతో వెస్ట్ జోన్ పోలీసులు దారి కాచి అడ్డుకున్నారు. ఈశ్వర్ దిలీప్, హరీష్ రామ్ బాయ్, అజిత్ సింగ్, రాథోడ్‌ అనే వ్యక్తలను అదుపులోకి తీసుకుకుని ప్రశ్నిస్తున్నామని కమిషనర్ అంజనీ కుమార్ మీడియాకు తెలిపారు. ఇంత డబ్బును నిందితులు ఎక్కడికి తీసుకెళ్తున్నారో విచారిస్తున్నామని, ఆదాయ పన్ను శాఖతో కలసి కేసును దర్యాప్తు చేస్తామని తెలిపారు.