Huge increase in engineering fees in Telangana
mictv telugu

తెలంగాణలో భారీగా పెరిగిన ఇంజనీరింగ్ ఫీజులు.. పరేషాన్‌లో పేరెంట్స్

September 5, 2022

తెలంగాణలో ఇంజనీరింగ్ విద్యార్ధులకు షాకింగ్ లాంటి వార్త ఇది. ఫీజులను కళాశాలలు భారీగా పెంచుకున్నాయి. ఫీజులు పెంచాలంటూ 79 కాలేజీలు హైకోర్టులో పెట్టుకున్న పిటిషన్‌పై సానుకూల తీర్పు వెలువడింది. ఈ మేరకు కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 36 ఇంజనీరింగ్ కాలేజీల్లో వార్షిక ఫీజు లక్ష దాటింది. దీనివలన పదివేల ర్యాంకు దాటిన విద్యార్ధులపై భారం పడనుంది. సీబీఐటీలో లక్షా 73 వేలు, వాసవి, వర్ధమాన్, సీవీఆర్, బీవీఆర్ ఐటీ మహిళా కాలేజీలలో లక్షా 55 వేలు, శ్రీనిధి, వీఎన్ఆర్ జ్యోతిలలో లక్షా 50 వేలు చొప్పున పెంచినట్టు సమాచారం. మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో మిగతా కాలేజీలు కూడా పెంచే దిశగా ఆలోచిస్తున్నాయి. అటు ఫీజుల పెంపుపై జీవో ఇవ్వకుండానే ప్రభుత్వం కౌన్సెలింగ్ ప్రారంభించింది. మంగళవారం నుంచి తొలి విడత సీట్ల కేటాయింపు జరుగనుంది. ఈ నెల 13 వరకు ఫీజు చెల్లింపుకు ప్రభుత్వం గడువు ఇచ్చింది.