భారీగా పెరిగిన వంటగ్యాస్ ధర.. ఇవాళ్టి నుంచే - MicTv.in - Telugu News
mictv telugu

భారీగా పెరిగిన వంటగ్యాస్ ధర.. ఇవాళ్టి నుంచే

July 6, 2022

దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో ఇవాళ్టి నుంచే చమురు సంస్థలు తాజాగా పెంచిన గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర అమల్లోకి రానుంది. తాజాగా చమురు సంస్థలు వంటగ్యాస్ సిలిండర్ ధరను రూ. 50కి పెంచిన విషయం తెలిసిందే. పెంచిన వంటగ్యాస్ ధరలు జులై 6వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని చమురు సంస్థలు పేర్కొన్నారు. ఆ ప్రకారమే నేటి నుంచి పెంచిన వంటగ్యాస్ ధర అమల్లోకి వచ్చింది.

ఇక, చమురు సంస్థలు తాజాగా పెంచిన ధరతో హైదరాబాద్‌లో గ్యాస్ ధర రూ. 1055 నుంచి రూ.1105కి చేరింది. సాధారణంగా ప్రతినెల 1న వీటి ధరల్లో మార్పులు చేర్పులు ఉంటాయి. ఈనెల 1న 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను చమురు సంస్థలు రూ.183, 50 మేర తగ్గించినప్పటికి, గృహావసరాల గ్యాస్ ధరను మాత్రం పెంచాయి. దీంతో మార్కెట్లో పెరిగిన ధరలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సామాన్యుడి నెత్తిపై మరో భారం పడింది. ఈ క్రమంలో వంటగ్యాస్ విషయంలో చమురు సంస్థలు సామాన్యుడికి ప్రతి నెల ధరల విషయంలో షాకుల మీద షాకులు ఇస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా పెంచిన రూ. 50 అమల్లోకి వచ్చిందని పేర్కొన్నాయి.