ఏపీలో రౌడీషీటర్లకు భారీ జాబ్‌మేళా - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో రౌడీషీటర్లకు భారీ జాబ్‌మేళా

March 5, 2022

ఆంధ్రప్రదేశ్‌లో రౌడీషీటర్లకు పోలీసులు జాబ్‌మేళాను నిర్వహించారు. విజయవాడ పోలీసు కమిషనరేట్, నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ ఆధ్వర్యంలో శనివారం ఈ జాబ్ మేళాను నిర్వహించినట్లు తెలిపారు. అయితే ఈ జాబ్‌మేళాలో మొత్తం 16 సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. వందల సంఖ్యలో యువత, రైడీషీటర్లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా విజయవాడ సీపీ కాంతిరాణా టాటా మాట్లాడుతూ.. ”విజయవాడలో రౌడీషీటర్ల సమస్య ఎప్పటినుంచో ఉంది. వారితో మాట్లాడే సమయంలో వారి సమస్యలు మాకు అర్థం అయ్యాయి. అందుకే ఈ జాబ్ మేళాను నిర్వహించాం” అని అన్నారు. అంతేకాకుండా విజయవాడ నగరంలో రౌడీషీటర్లకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ప్రకటించడంతో చాలా మంది ముందుకొచ్చారు అని తెలిపారు. పాత జీవితాన్ని వదిలిపెట్టి, సరికొత్త జీవితాన్ని ప్రారంభించాలని రౌడీషీటర్లకు సీపీ సూచించారు.