బెడ్ రూమ్ లో భారీ ‘కింగ్ కోబ్రా’..ఎలా పెట్టుకున్నారో చూడండి - MicTv.in - Telugu News
mictv telugu

బెడ్ రూమ్ లో భారీ ‘కింగ్ కోబ్రా’..ఎలా పెట్టుకున్నారో చూడండి

August 13, 2020

ఇంట్లోకి చిన్న బొద్దింక వస్తేనే కొందరు భయపడతారు. అలాంటిది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనిటాల్ లో ఒకరి ఇంట్లోని పడక గదిలోకి ఏకంగా ఓ భారీ కింగ్‌ కోబ్రా వచ్చింది. దానిని చూసిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా భయంతో బయటికి పరుగులు తీశారు. తరువాత వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారాన్ని అందించారు. 

దీంతో వారు రంగంలోకి దిగి.. కింగ్‌ కోబ్రాను చాకచక్యంగా పట్టుకున్నారు. తరువాత దాన్ని సమీప అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. పట్టుబడ్డ కింగ్ కోబ్రా దాదాపు 10 అడుగులకు పైగా ఉందని అధికారులు తెలిపారు. ఆ పామును పట్టుకుంటుండగా వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త వైరల్ అవుతోంది. దానిని చూసిన నెటిజన్లు జాగ్రత్త అంటూ ఆ కుటుంబ సభ్యులకు సూచిస్తున్నారు.