కమల్ హాసన్ సినిమాకు భారీ ఆఫర్.. చరిత్రలో తొలిసారి - MicTv.in - Telugu News
mictv telugu

కమల్ హాసన్ సినిమాకు భారీ ఆఫర్.. చరిత్రలో తొలిసారి

March 1, 2022

vi

విలక్షణ నటుడు, లోకనాయకుడు కమల్ హాసన్ తాజాగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘విక్రమ్’. ఖైదీ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన లోకేష్ కనకరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్టులైన విజయ్ సేతుపతి, పుష్పలో విలన్ గా చేసిన మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కమల్ నటించిన గత చిత్రం విశ్వరూపం 2 ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా భావించి రూపొందిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ఏప్రిల్ 28న చిత్ర విడుదలకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు రూ. 110 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం భారీ స్థాయిలో బిజినెస్ చేస్తోంది. కేవలం శాటిలైట్, డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థలైన డిస్నీ+హాట్ స్టార్ లు రూ.115 కోట్లకు కొనుగోలు చేశాయని కోలీవుడ్ సమాచారం. దీని ద్వారానే పెట్టిన పెట్టుబడి వచ్చేయగా, ఇంక థియేట్రికల్ రైట్స్ ద్వారా వచ్చేదంతా లాభామే. ఇదే నిజమైతే దేశ సినీ చరిత్రలో కొత్త రికార్డు నమోదవడం ఖాయం. పేరున్న ఆర్టిస్టులు నటిస్తుండడంతో ఇతర భాషల డిస్ట్రిబ్యూటర్లు కూడా మంచి రేటుకు సినిమాను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి.