రెండు ఎద్దులకు అదిరేటి ధర.. 17 లక్షలు.. - MicTv.in - Telugu News
mictv telugu

రెండు ఎద్దులకు అదిరేటి ధర.. 17 లక్షలు..

October 12, 2020

Huge price for two bulls .. 17 lakhs ..

ఎద్దులలో ఒంగోలు వంటి దేశీయ జాతి ఎద్దులు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. వాటి ధర కూడా సాధారణ ఎద్దుల కన్నా ఎక్కువగానే ఉంటుంది. ఎత్తైనా మోపురంతో చూపరులను ఆకట్టుకుంటాయి. అయితే కర్ణాటకలోని బాగల్‌కోట్‌లో ఓ జత ఎడ్లు అదిరేటి ధరకు అమ్ముడుపోయాయి. రెండు ఎద్దులకు కలిపి రూ.17 లక్షలకు విక్రయించారు. మహాలింగపుర్‌లోని నందగావ్‌లో సంగప్ప అనే రైతు ఆ ఎద్దులను గత రెండేళ్ల నుంచి ఎంతో అపురూపంగా సాదుకుంటున్నాడు. 

అక్కిమారడికి చెందిన మల్లప్ప దగ్గరి నుంచి 2018లో ఆ ఎడ్లను సంగప్ప కొన్నాడు. అప్పుడు వాటి విలువ రూ.8 లక్షలు. వాటికి నిత్యం కల్లిపిండి, పచ్చి గడ్డి వంటి బలవర్ధక ఆహారం అందిస్తూ గిత్తల్లా తయారు చేశాడు. తన ఎద్దులకు సంగప్ప ముద్దుగా రామ్‌-లక్ష్మణ్‌ అనే పేర్లు పెట్టుకున్నాడు. ఇప్పటివరకు ఆ జత ఎద్దులు 48 పోటీల్లో పాల్గొన్నాయట. పాల్గొన్న పోటీల్లో కచ్చితంగా ట్రోఫీ, నగదు బహుమతి గెలుస్తూ వచ్చాయి. అలా అవి ఇప్పటివరకు సుమారు రూ.9 లక్షలు సంపాదించాయట. దాదాపు అన్ని రేసుల్లోనూ తొలి రెండు స్థానాల్లోనే నిలిచి గెలిచేవి. ఏమైందో తెలియదు కానీ.. ఇప్పుడు మళ్లీ మల్లప్పకే వాటిని రూ.17 లక్షలకు విక్రయించాడు సంగప్ప. మల్లప్ప వాటిని కొని మళ్లీ పోటీలకు సిద్ధం చేస్తున్నాడట. తన ఎద్దులు తనవద్దకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది అంటున్నాడు.