ఏ రోగమూ లేకపోయినా ఆ లేడీ డాక్టర్ వద్దకు భారీ క్యూ..  - MicTv.in - Telugu News
mictv telugu

ఏ రోగమూ లేకపోయినా ఆ లేడీ డాక్టర్ వద్దకు భారీ క్యూ.. 

October 17, 2020

Huge queue to see that lady doctor if there is no disease ..

కడుపు నొప్పో, కాలు నొప్పో అని ఎవరైనా వైద్యుల వద్దకు వెళ్తారు. అంతేగానీ టైంపాస్ కోసం ఎవరూ వెళ్లరు. కానీ, ఓ డాక్టర్ వద్దకు పేషెంట్లు క్యూ కడుతున్నారు. ఆమె వైద్య పరీక్షలు చేసి ‘మీకు ఏ రోగమూ లేదు వెళ్లండి’ అన్నా ఆమె దగ్గరినుంచి కదలడం లేదు. ‘లేదు మేడం మీరు సరిగ్గా చూడండి. మీరు బాగా పరీక్షించి చూస్తే ఏదో ఒక జబ్బు బయటపడుతుంది’ అని సదరు పేషెంట్లు కానివారి ఆమెతో మొరపెట్టుకుంటున్నారు. ‘మీ చేయి పడితే మా ఒంట్లోకి ఏ రోగం రమ్మన్నా రాదు మేడం. మీ చేతి వైద్యం మహిమ చూడాలనుకుంటున్నాం’ అని మరికొందరు అక్కడ తిష్ఠవేసి కూర్చుంటున్నారు. ‘ఇదేం తలకాయ నొప్పిరా నాయనా’ అని తల పట్టుకుంటోంది సదరు లేడీ డాక్టర్. ఎందుకు ఆమె వద్దకు ఇలా జబ్బులు లేకుండానే వస్తున్నారంటే.. ఆమె సెక్సీయెస్ట్ డాక్టర్ అవడం వల్ల. తెల్ల కోటు వేసుకున్న ఆమె అందానికి ముగ్దులయ్యారు అక్కడి పురుష పుంగవులు. ఆమెతో మాటా మాటా కలిపి చనువు పెంచుకుందామని వెళ్తున్నవారే ఎక్కువ. వీళ్లతో అసలు పేషెంట్లకు సమస్యలు వచ్చి పడుతున్నాయి. ఆమె పేరు డాక్టర్ జాసెనియా వైజ్(32). ప్రపంచంలోనే అందమైన డాక్టర్‌గా ఆమెను సోషల్ మీడియాలో కొనియాడుతున్నారు. ఇదివరకు ఆమె సైకియాట్రిక్ క్లినిక్‌‌లో కన్సల్టెంట్‌గా పనిచేసింది. ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించిన వారికి చికిత్స చేసేది. అలా ఆమె వద్దకు వెళ్లినవారు జీవితంలో మళ్లీ ఆ ప్రయత్నం చేసేవారు కాదు. 

అందుకు బలమైన కారణం ఆమె అందమే. ఆమె అందంగా చెబుతున్న మాటలు చెవులారా విని జీవితం మీద ఆశలు పెంచుకుంటున్నారు. అయితే సదరు డాక్టరమ్మ వారి ప్రవర్తన మీద విసుగు చెందింది. తన అందం కోసం వస్తున్నవారి మాటలు విని ఆమె కూడా ఆ దిశగా ఆలోచించింది. ‘నా అందం ఇంతమంది మతి చెడగొడుతుంటే.. నేనెందుకు అందాల నెలవు అయిన మోడలింగ్ రంగంలో ప్రయత్నించవద్దు’ అని అనుకుంది. అనుకున్నదే తడవుగా డాక్టర్ వృత్తికి తిలోదకాలు ఇచ్చింది. మోడలింగ్ రంగంలోకి కాలుమోపింది. మోడల్‌గా ఆమె ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు పొందింది. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదామె. ఎన్నో పాపులర్ మ్యాగజైన్ల కవర్ పేజీలపై ఆమె ఫోటోలు ముద్రించబడ్డాయి. ప్రముఖ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ అయి క్రమంగా ఎంతో ఫేమస్ అయింది. సంపాదన కూడా బాగానే పెరిగింది. కాగా, ఇప్పటికీ ప్రపంచంలోనే అందమైన డాక్టర్‌గా ఆమెకు వచ్చిన గుర్తింపు చెక్కుచెదరలేదు. డాక్టర్ కావాలనుకున్నవారు యాక్టర్ అవుతున్న కథలు ఎన్నో విన్నాం. అయితే ఈమె మాత్రం డాక్టర్ నుంచి మోడల్ అయింది. మోడల్ అయ్యాక ఆమె తన హాట్ హాట్ ఫోటోలను అంతర్జాలంలో పంచుకుంది. వాటిని చూసి చాలా మంది ఆమె చికిత్స కోసం ఇంకా తహతహలాడుతున్నారు. ఆ వంకతో మళ్లీ ఆమె అందాలను దగ్గరినుంచి ఆస్వాదించవచ్చని తెగ ఆరాట పడుతున్నారు. అయితే జాసెనియా మాత్రం తానిప్పుడు ఎవరికీ వైద్యం చేయనని.. తన ఫోకస్ అంతా మోడలింగ్ పైనే ఉందని క్లారిటీగా చెప్పేస్తోంది.