Huge sex racket in BJP leader's farmhouse in meghalaya
mictv telugu

బీజేపీ నేత ఫాంహౌస్‌లో భారీ సెక్స్ రాకెట్.. 30 గదుల్లో 73 మంది అరెస్ట్

July 24, 2022

ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో భారీ సెక్స్ రాకెట్ వెలుగు చూసింది. ఆ రాష్ట్ర బీజేపీలో కీలక నేతగా ఉన్న బెర్నార్డ్ మరాక్ అలియాస్ రింపూ ఫాంహౌస్‌లో 73 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో 23 మంది మహిళలు ఉన్నారు. వీరితో పాటు నలుగురు బాలురు, ఒక బాలిక కూడా ఉన్నారు. వెస్ట్ గారోహిల్స్ జిల్లాలోని తురా పట్టణ సమీపంలో ఈ ఫాంహౌస్ ఉంది. రైడ్ చేసినప్పుడు ఐదుగురు చిన్నారులు దారుణమైన స్థితిలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఇంకా 400 మద్యం బాటిళ్లు, 500 పైగా కండోమ్ ప్యాకెట్లు, గర్భనిరోధక మాత్రలు, 47 ఫోన్లు, 8 బైకులను స్వాధీనం చేసుకుని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. ఫాంహౌస్‌లో ఏకంగా 30 గదులున్నట్టు పోలీసులు గుర్తించారు. రైడ్ విషయం తెలిసి బీజేపీ నేత రింపూ పరారవగా, అతనికోసం పోలీసులు గాలిస్తున్నారు. గతంలో మిలిటెంట్‌గా విధులు నిర్వహించిన మారక్, శాంతి ఒప్పందంలో భాగంగా ఆయుధాలతో సహా లొంగిపోయి అనంరం రాజకీయాల్లో ప్రవేశించాడు. బీజేపీలో చేరి ఆ రాష్ట్రంలో కీలక నేతగా ఎదిగారు.