రేప్ కేసు బాబాకు భారీ మద్దతు! - MicTv.in - Telugu News
mictv telugu

రేప్ కేసు బాబాకు భారీ మద్దతు!

August 23, 2017

అత్యాచార కేసుల్లో నిందితుడైన వ్యక్తికి సమాజంలో గౌరవం ఉండదు. అతడు ఆ నేరం చేశాడో లేదో తేలేవరకు జనం అతన్ని అనుమానంగానే చూస్తుంటారు. అయితే డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రాం రహీంకు మాత్రం జనం నుంచి అనూహ్యంగా భారీగా మద్దతు లభిస్తోంది.  ఆయనపై నమోదైన రేప్ కేసులో హరియాణా పంచకులలోని సీబీఐ కోర్టు ఈ నెల 25న తీర్పు వెలువరించనుంది. ఏ క్షణంలో ఏ జరుగుతుందోనని పంజాబ్, హరియాణా రాష్ట్రాల పోలీసులు బెంబేలు పడిపోతున్నారు.

ఈ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి గుర్మీత్ పావులు కదిపిపెట్టుకున్నారు. ఇంకే భక్తజనం తండోపతండాలుగా ఆయన ఆశ్రమానికి వచ్చి చేరుకుంటున్నారు. ఇప్పటివరకు 50 వేల మంది ఆశ్రమానికి చేరుకున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనే అనుమానంతో పోలీసులు ఆ ప్రాంతంలో భారీ భద్రత ఏర్పాటు చేవారు. పంచకులతోపాటు చండీగఢ్, మొహాలీల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు తీర్పు వెలువడే సమయానికి ఈ మూడు పట్టణాల్లోకి 10 లక్షల మంది చేరుతారని అంచనా.  రేప్ కేసులో బాబాకు మద్దతుగా నిలబడతామని, ఆయన్ను ఇబ్బంది పెడితే సహించబోమని ఇప్పటికే పలు కుల సంఘాలు హెచ్చరించాయి.

గుర్మీత్ రహీం.. 2002లో ఇద్దరు సాధ్వీలపై అత్యాచారానికి ఒడిగట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి.  సిర్సా శివార్లలో ఉన్న డేరా ప్రధాన కార్యాయలంలో ఆయను తమపై అఘాయిత్యం చేశాడని బాధితులు ఆరోపించారు.