ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ట్విస్టుల మీద ట్విస్టులు నెలకొంటున్నాయి. ఇప్పటికే పలువురు వ్యాపారులు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. పలువురు రాజకీయ నేతల పేర్లు బయటకు వచ్చాయి. ఈ క్రమంలో హైదరాబాద్కు చెందిన ఓ యువ శాస్త్రవేత్త పేరు కూడా తెరపైకి వచ్చింది. గొరకవి ప్రవీణ్ కుమార్ (33) అనే వ్యక్తిపై ఈ కేసు విషయంలో ఈడీ చార్జ్ షీటు దాఖలు చేసింది. చార్జ్ షీటులో కీలక అంశాలను ప్రస్తావించింది. దుబాయ్ కంపెనీతో పాటు ‘ఫ్లై’ కంపెనీకి నిధులు మళ్లింపు జరిగిందని ఈడీ గుర్తించింది.
ఈ ‘ఫ్లై’ కంపెనీకి సైంటిస్టు ప్రవీణ్ కుమార్ గొరకవి ఫౌండర్ గా ఉన్నారు. ప్రవీణ్ కుమార్ పాత్రపై ఈడీ ప్రవీణ్ కుమార్ పాత్రపై లోతుగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. స్కాంలో నిధుల్ని హవాలా రూపంలో ప్రవీణ్ కుమార్ కంపెనీకి మళ్లించినట్టు ఈడీ అభియోగం మోపుతోంది. ఎవరెవరు ఎంతెంత ఈ ‘ఫ్లై’ కంపెనీకి నిధులు మళ్లించారు అనే విషయంపై ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. ప్రవీణ్ కుమార్ ఇంటిపై గతంలోనూ ఈడీ దాడులు నిర్వహించింది. ఈ క్రమంలోనే రూ.24 లక్షలను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో సీఏ బుచ్చిబాబుకు ప్రవీణ్ కుమార్ గొరకవి సన్నిహితుడని గుర్తించారు ఈడీ అధికారులు. బాలమేధావిగా పేరు దక్కించుకున్న ప్రవీణ్.. పలు ఆవిష్కరణలు కూడా చేశాడు. గతంలో ప్రముఖ శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాం నుంచి అవార్డు, అభినందనలు సైతం అందుకోవడం గమనార్హం.