Hugo Boss is selling bathroom slippers for ₹8,990. Would you buy it?
mictv telugu

రూ. 99 చెప్పుల ధర ఆన్‌లైన్‌లో 9 వేలు…

October 19, 2022

వార్త చదవబోయే ముందు ఫొటో బాగా చూడండి. ఈ బాత్రూం స్లిప్పర్లు ఎలా కనిపిస్తున్నాయి? రోడ్లు పక్క ప్లాట్‌ఫామ్‌పై చెప్పుల్లాగే ఉన్నాయి కదా. వీటి ధర మహా అయితే 100 రూపాయలు. వంద అంటే నోరు వెళ్లబెడతారని సైకలాజికల్‌గా మాయ చేయడానికి ఒక రూపాయి తగ్గించి రూ. 99కి అమ్ముతుంటారు. ఇంకా నాణ్యమైన స్లిప్పర్లయితే రూ. 200 నుంచి 500 వరకు, ఇంకా మహా అయితే 1000 వరకు ఉండొచ్చు. కానీ ఏకంగా రూ. 19,500లకు అమ్మేస్తున్నారు. పాపం మరీ అంతగా దోచుకోవడం ఎందుకని 50 శాతం డిస్కౌట్ పడేసి అక్షరాలా రూ. 8,990కు తగ్గించారు. దీనికి నెలసరి వాయిదా చెల్లింపు పద్ధతి కూడా ఉందంట. ధర చూస్తేనే గుండెలు గుబగుబలాడే ఈ చెప్పులు బ్రాండెడ్‌వే లెండి. హుగో బాస్ బ్రాండ్ స్లిప్పర్స్‌ ఇవి.

ఎంత బ్రాండెడ్ అయితే మాత్రం మరీ ఇంత ఘోరమైన ధర పెడతారా అని జనం ఏకిపారేస్తున్నారు. వీటికంటే నాణ్యమైన చెప్పులు చీప్ ధరకే రోడ్లపై దొరుకుతుంటే బ్రాండెడ్ పేరుతో దోచుకోవడం అన్యాయమని మండిపడుతున్నారు. మరికొందరు మాత్రం వత్తాసు పలుకుతున్నారు. వేలు, లక్షల పోసి వాచీలు, టీషర్టు కొంటున్నారని, వాటికి లేని అభ్యంతరం వీటిపై ఎందుకని ప్రశ్నిస్తున్నారు. వీరికి కౌంటర్ ఇస్తూ మరికొందరు డిస్కౌంట్‌కు కొనడం తలవంపులుగా ఉంటుందని అసలు ధరకు ఇంకో యాభై శాతం కలిపి 30 వేలకు అమ్మితే బావుంటుందని జోకుతున్నారు.