హుజూర్‌నగర్‌లో కొనసాగుతున్న పోలింగ్ - MicTv.in - Telugu News
mictv telugu

హుజూర్‌నగర్‌లో కొనసాగుతున్న పోలింగ్

October 21, 2019

తెలంగాణలోని హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. పొద్దునే ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మొత్తం 302 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. 28 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో ముగ్గురు మహిళా అభ్యర్థులు ఉన్నారు. నేరేడుచర్లలో ఈవీఎంలు మొరాయించడంతో అక్కడ పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. మిగతా చోట్ల ఓటింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో 2,36,842 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 79 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను అధికారులు గుర్తించారు. ప్రతి సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రంలోనూ సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటు చేశారు. 3,350 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

Hujur nagar bypoll..

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీకి పోలింగ్ ప్రారంభమైనది. మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఇక్కడ మొత్తం 3,237 మంది బరిలో ఉన్నారు. వీరిలో 235 మంది మహిళా అభ్యర్థులు. హర్యానాలో 90 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ మొత్తం 1169 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 104 మంది మహిళలు. వీటితోపాటు మరో 16 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 51 అసెంబ్లీ స్థానాలకు మహారాష్ట్రలోని సతారా, మధ్యప్రదేశ్‌లోని సమస్తీపూర్ లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఈ నెల 24న ఫలితాలు ప్రకటిస్తారు.