పేద బతుకులపై కూలిన పెద్దోళ్ల గోడ.. 17 మంది మృతి - MicTv.in - Telugu News
mictv telugu

పేద బతుకులపై కూలిన పెద్దోళ్ల గోడ.. 17 మంది మృతి

June 29, 2019

నిర్మాణ లోపాలకు భారీ వర్షం తోడై 17 బడుగు బతుకులు బలయ్యాయి. మహారాష్ట్రలోని పూణే నగరంలో ఈ రోజు ఓ అపార్ట్‌మెంట్ కాంపౌండ్ గోడ దాని ఆనుకుని ఉన్న గుడిసెలపై పడ్డడంతో వాటిలో నివసిస్తున్ బీదాబిక్కీ విగతజీవులుగా మారారు. వీరిలో కొందరు పిల్లలు కూడా ఉన్నారు. ఉదయం కొంధ్వా ప్రాంతంలోని తలాబ్ మసీదు ఈ విషాదం చోటు చేసుకుంది. 20 అడుగుల ఎత్తు, 60 అడుగుల పొడవు ఉన్న గోడ వర్షం వల్ల కూలిపోయిందని చెబుతున్నారు. అపార్ట్‌మెంట్ ఆవరణలో పార్క్ చేసి కొన్ని కార్లు కూడా గోడతోపాటు కూలి గుడిసెలపై పడ్డాయి. శిధిలాల కింద ముగ్గురు ఉన్నట్లు తెలుస్తోంది.