humanoid robot will be unveiled Soon : Elon Musk
mictv telugu

‘చిట్టీ ద రోబో’ తయారీలో ఎలాన్ మస్క్.. త్వరలో ఆవిష్కరణ

June 25, 2022

రజనీకాంత్, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన రోబో సినిమాలో చిట్టీ అనే రోబో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తెరపై అలాంటి టెక్నాలజీని చూసి ఆశ్చర్యపోయిన మనకు అచ్చం అలాంటి రోబోను నిజ జీవితంలో త్వరలో చూడబోతున్నాం. దీనిని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తయారు చేస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 30న టెస్లా ఆర్టీఫిషియల్ డేను పునస్కరించుకొని కొత్త రోబోను ఆవిష్కరిస్తామని ఆయన అధికారికంగా ప్రకటించారు. దీనికి ఆప్టిమస్‌గా పేరు పెట్టినట్టు తెలిపారు. హ్యూమనాయిడ్ రోబోగా పిలిచే ఈ రోబో ఎత్తు ఆరడుగులు ఉంటుంది. 68 కేజీల వరకు బరువు ఎత్తగలదు. గంటకు ఎనిమిది కిలోమీటర్ల స్పీడుతో నడవగలదు. ప్రమాదకర పరిస్థితుల్లో చాలా కీలకంగా పనిచేస్తుంది. అలాగే టెస్లా కార్లతో ఈ రోబోలు అనుసంధానమై ఉంటాయి. వస్తు తయారీ కంపెనీల్లోని చాలా పనులను చక్కపెట్టగలదంటూ ప్రత్యేకతలను వివరించాడు ఎలాన్ మస్క్.