ఏపీలో దేవుడి హుండీ దొంగతనం.. బిర్యానీ కోసమని - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో దేవుడి హుండీ దొంగతనం.. బిర్యానీ కోసమని

September 29, 2020

hunndi

ఇప్పటికే ఏపీలో వరుసగా హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతుండటంతో చాలా మంది అసహనంతో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఓ హుండీ దొంగతనం సంచలనం రేపింది. బిర్యానీ తినడానికి ఇద్దరు బాలలు హుండీ పగలగొట్టి డబ్బులు దోచుకెళ్లారు. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల ఆంజనేయస్వామి ఆలయంలో ఇది జరిగింది. ముందుగా అంతా దోపిడి దొంగల పని అనుకున్నారు. తీరా ఈ విషయం తెలియడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని బాలల సదనానికి తరలించారు. 

ఈ నెల 26వ తేదీ అర్ధరాత్రి ఆంజనేయ స్వామి ఆలయంలో దొంగతనం జరిగింది. గుర్తు తెలియని దుండగులు తాళం పగలగొట్టి డబ్బులు తీసుకెళ్లారు. దీంతో అంతా ఆందోళన చెందారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. ఇద్దరు బాలలుగా గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం తెలిసింది. తమకు బిర్యానీ తినాలనిపించి డబ్బుల కోసం ఆ పని చేశామన్నారు. కేవలం రూ. 140 మాత్రమే తీసుకున్నామని చెప్పారు. వీరిద్దరిది సమీపంలోని జగన్నాథపురంగా గుర్తించారు. కాగా, ఆ ప్రాంతంలో తరుచూ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయని అధికారులు వెల్లడించారు.