అమ్మకు నేటితో వందేండ్లు: ప్రధాని - MicTv.in - Telugu News
mictv telugu

అమ్మకు నేటితో వందేండ్లు: ప్రధాని

June 18, 2022

భారత ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ శనివారంతో వంద సంవత్సరంలోకి అడుగుపెట్టారు. తల్లి జన్మదినాన్ని పురస్కరించుకొని నరేంద్ర మోదీ శుక్రవారం రాత్రే అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. శనివారం ఉదయం తన తల్లి హీరాబెన్‌కు పాదపూజ నిర్వహించి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తల్లి పాదాలకు నమస్కరించి, కాసేపు తల్లితో ఆయన ముచ్చటించారు.

హీరాబెన్ మోదీ.. 1923, జూన్ 18న జన్మించారు.ప్రస్తుతం ప్రధాని సోదరుడు పంకజ్ మోదీతో ఆమె గాంధీనగర్‌లో ఉంటున్నారు. గుజరాత్ పర్యటనలో ఉన్న మోదీ, తన తల్లి జన్మదినాన్ని పురస్కరించుకొని గాంధీనగర్‌లో ఆమెను కలిసి అశీర్వచనాలు తీసుకున్నారు. నరేంద్ర మోదీ, ఆయన తల్లికి పాదపూజ చేసిన ఫోటోలో నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అయితే, తల్లి పుట్టిన రోజు గుజరాత్‌లోని రైసెన్ ప్రాంతంలోని 80 మీటర్ల రహదారికి పూజ్య హీరాబా మార్గ్ అనే పేరు పెట్టాలని తాము నిర్ణయించుకున్నామని గాంధీనగర్ మేయర్ హితేష్ మక్వానా వెల్లడించారు.

మరోపక్క ప్రధాని అక్కడ నుంచి బయలుదేరి పంచమహల్ జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పావగఢ్‌కు చేరుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 15వ శతాబ్దంలో నిర్మించిన పావగడ ఆలయ శిఖరం గత ఐదు శతాబ్దాలుగా శిథిలావస్థకు చేరుకోవడంతో గతకొన్ని నెలలుగా అధికారులు మరమ్మత్తులు చేసి, కొత్త రూపంతో రీడిజైన్ చేశారు. ఈ క్రమంలో ప్రధాని ఆలయానికి చేరుకొని, ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భక్తులను అనుమతించనున్నారు.