మహాఘోరం.. 350 ఏనుగుల కళేబరాలు..  - MicTv.in - Telugu News
mictv telugu

మహాఘోరం.. 350 ఏనుగుల కళేబరాలు.. 

July 2, 2020

Hundreds of Elephants Mystery in South Afric

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 350 ఏనుగులు ఊహించని రీతిలో మృత్యువాతపడ్డాయి. అడవిలో ఎటు చూసిన ఏనుగు కళేబరాలే దర్శనం ఇస్తున్నాయి ఈ మహా విషాద ఘటన దక్షిణాఫ్రికాలోని బొస్ట్వానాలో చోటు చేసుకుంది. కేవలం రెండు నెలల వ్యవధిలోనే ఈ విలయం జరిగినట్టుగా అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకేసారి ఇన్ని మరణాలు సంభవించడానికి కారణాలు ఏంటని అన్వేసిస్తున్నారు వేటగాళ్లు చంపారని అనుకుందామన్నా వాటి దంతాలు కూడా అలాగే ఉండిపోయాయి. దీంతో ఇదో మిస్టరీగా మారిపోయింది. 

యూకెకు చెందిన ఛారిటీ నేషనల్ పార్కు రెస్క్యూకు చెందిన డాక్టర్ నియాల్ మక్కాన్ మే నెలలో ఒవావాంగో డెల్టా ప్రాంతంలో విమానంలో ప్రయాణిస్తూ 169 ఏనుగు మృతదేహాలను గుర్తించారు. అప్పటికే చాలా ఏనుగులు అచేతనంగా ఉన్నాయని గమనించి వెంటనే దక్షిణాఫ్రికా ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వం సర్వే చేపట్టింది. ఒక్క బొస్ట్వానా ప్రాంతంలో 350కి పైగా ఏనుగు కళేబరాలు కనిపించాయి. వరుసగా ఏనుగులు మాత్రమే చనిపోవడం ఏంటని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. విష పదార్థాలు కలిసి నీరు తాగినా కూడా మిగితా జంతువులు చనిపోయిన ఆనవాళ్లు కూడా ఉండాలి. కానీ అది కూడా జరగలేదు. వాటి నుంచి నమూనాలు సేకరించి పరీక్షల కోసం పంపించారు. ఆ రిపోర్ట్ వస్తే కానీ ఏం జరిగింది అనేది చెప్పలేమని అధికారులు వెల్లడించారు.