ఇరాన్లో దారుణ ఘటనలు వెలుగు చూసాయి. ఆడపిల్లలు చదవుకోవడం ఇష్టం లేని సంఘ విద్రోహ శక్తులు వారిపై విషప్రయోగం చేస్తున్నారు. హిజాబ్ ఆందోళన సమయంలో ఈ ఘటనలు జరిగాయి. టెహ్రాన్‌లో కోమ్‌లోని ఒక పాఠశాలలో విద్యార్థినులు చేసే భోజనంలో విషమం కలిపినట్టు తెలుస్తోంది. దీంతో వందలాది మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాన్ని డిప్యూటీ హెల్త్ మినిష్టర్ యూనెస్ పనాహి ఆదివారం అధికారికంగా వెల్లడించారు. ఈ అనుమానుషానికి పాల్పడిన వారు బాలికలకు విద్య అవసరం లేదని, స్కూళ్లను మూసివేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.
గత నవంబరు నుంచే అనేకమంది విద్యార్థినులు శ్వాస సరిగా తీసుకోలేక ఆసుపత్రి పాలయ్యారని ఆయన వెల్లడించారు.టెహరాన్‌కు దక్షిణాన ఉన్న ఈ సిటీలో విద్యార్థినులపై విష ప్రయోగం జరిగినట్టు ఆయన నిర్ధారించారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయకపోవడంతో విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన బాట పట్టారు. నగర గవర్నేట్ కార్యాలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఘటనకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోందని ప్రభుత్వ ప్రతినిధి అలీ బహదోరి తెలిపారు. ఇంటెలిజెన్స్, విద్యా మంత్రిత్వ శాఖలు విచారిస్తున్నాయని వెల్లడించారు. గత కొంతకాలంగా ఆందోళనలతో ఇరాన్ అట్టుడుకుతూనే ఉంది. 22 ఏళ్ల కుర్దిష్ మహిళ మహ్స అమీని మరణంతో మొదలైన నిరసనలు దేశ వ్యాప్తంగా తీవ్ర రూపం దాల్చాయి.