తిండి దొరక్క అనాథను చంపేసిన కుక్కలు  - MicTv.in - Telugu News
mictv telugu

తిండి దొరక్క అనాథను చంపేసిన కుక్కలు 

May 20, 2020

bfrgg

లాక్‌డౌన్ మనుషులకే కాకుండా జంతువులకు కూడా పిచ్చెక్కించింది. జనం రోడ్లపై తిరుగుతున్నప్పుడు వాళ్లు పారేసిన తిండిని, హోటళ్లు పారేసిన ఆహారాన్ని తిని బతికిన కుక్కలు రెండు నెలలుగా ఆకలితో అల్లాడుతున్నాయి. పిచ్చితో దాడులకు కూడా దిగుతున్నాయి. తాజాగా కాన్పూర్‌లో వీధికుక్కలు మానసిక వికలాంగురాలిపై దాడి చేసి చంపేశాయి. కాకాదేవ్ ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. 

మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆమె వివరాలు తెలియడం లేదు. అనాథ కావొచ్చని భావిస్తున్నారు. లాక్‌డౌన్‌లో వల్ల ఆ ప్రాంతంలోని కుక్కలు తిండి దొరక్క కనిపించిన వారిపై దాడులకు పాల్పడుతున్నాయని చెప్పారు. కుక్కలను షెల్టర్ హోమ్స్‌కు తరలించాలని, లేకపోతే చంపేయాలని కోరుతున్నారు. దీనిపై అధికారులు స్పందించారు. వాటికి  ఆహారం పెట్టాలని మునిసిపల్ సిబ్బందిని ఆదేశించారు.