పిడికెడు తిండి కోసం పోట్లాట... నాయకులూ కళ్లుంటే చూడండి! - MicTv.in - Telugu News
mictv telugu

పిడికెడు తిండి కోసం పోట్లాట… నాయకులూ కళ్లుంటే చూడండి!

May 14, 2020

Hungry workers

కరోనాకు అందరూ సమానమే. కానీ లాక్‌డౌన్‌కు మాత్రం కొందరు ఎక్కవా, కొందరు తక్కువా. కాళ్లపైన కాళ్లు వేసుకునే తినే భద్రజీవులు కొందరైతే పిడికెడు తిండికోసం ఎదురు చూస్తున్న కళ్లు కోట్లు. అన్ని రకాలుగా ఆదుకుంటాం అని గొప్పగా హామీలు గుప్పిస్తున్న నేతు  వాస్తవంలో చేతులెత్తేసి బడ్జెట్లు, కాంట్రాక్టులు, పరిపాలన అంట్లూ వేరే పనుల్లో మునిగిపోయారు. రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని కేంద్రం ఒకపక్క ప్రకటిస్తుంటే మరోపక్క తిండి కోసం మనుషు పశుప్రాయంగా మరొకళ్లతో కొట్లాడాల్సిన దీనస్థితి. 

బిహార్‌లోని కథియార్‌లో ఈ విషాద దృశ్యం కనిపించింది. ఆకలితో అల్లాడుతున్న వలస కూలీలకు ఓ పెద్దాయన అన్నం పొట్లాలు తీసుకొచ్చాడు. ఆయన అటు రైలు దిగగానే ఇది ఆకలి బాధితులు తోసుకుంటూ చుట్టుముట్టారు. ఆయన చేతుల్లోంచి గుంజుకున్నారు. దొరికని వాళ్ల మరొకళ్లను అడ్డుకుంటూ పోట్లాడారు. చివరికి సంచి జారిపోయింది. వలస కూలీల కోసం ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతున్న పేరుగొప్ప సాయం ఆచరణలో ఎలా ఉందో చూపడానికి ఈ ఒక్క ఉదంతం చాలు. 

Hungry migrants desperate for food.

#WATCH: Left in the lurch hungry migrants jumped on a person carrying food in Bihar's Katihar.

Publiée par TIMES NOW sur Jeudi 14 mai 2020