America : అమెరికాలో హరికేన్ విధ్వంసం, 13మంది మృతి, న్యూయార్క్‌తో సహా పలు ప్రాంతాల్లో 10 అంగుళాల మేర పేరుకుపోయిన మంచు. - Telugu News - Mic tv
mictv telugu

America : అమెరికాలో హరికేన్ విధ్వంసం, 13మంది మృతి, న్యూయార్క్‌తో సహా పలు ప్రాంతాల్లో 10 అంగుళాల మేర పేరుకుపోయిన మంచు.

March 14, 2023

అమెరికాలో హరికేన్స్ విధ్వంసం స్రుష్టించాయి. ఈ తుఫానులో కనీసం 13 మంది మరణించారు, వందల ఇళ్లకు విద్యుత్‌ నిలిచిపోయింది. తుపాను ధాటికి కరెంటు లేక ప్రజలు చీకట్లో గడపాల్సి వస్తోంది. కాలిఫోర్నియాలో మరో తుఫాను వచ్చే అవకాశం ఉందని,  సోమవారం రాత్రికి రావచ్చని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ కాలంలో పెద్ద ఎత్తున ల్యాండ్ ఫాల్ అయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్‌లలో సోమవారం 10 అంగుళాల వరకు మంచు కురుస్తుందని నేషనల్ వెదర్ సర్వీస్ (NWS) అంచనా వేసింది. బలమైన గాలులను వీచే అవకాశం ఉందని తెలిపింది. వాతావరణ సూచన ప్రకారం, తుఫాను కారణంగా శనివారం ఉదయం వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ సమయంలో విపరీతమైన మంచు కురిసే అవకాశం కూడా ఉందని వెల్లడించింది.

BBC నివేదిక ప్రకారం, పశ్చిమ విస్కాన్సిన్, మిన్నెసోటాలోని చాలా ప్రాంతాలలో భారీ మంచు కురిసే అవకాశం ఉంది. ఈ శీతాకాలంలో మిన్నియాపాలిస్ , సెయింట్ పాల్ నగరాలు రెండూ ఇప్పటికే 80 అంగుళాల వరకు హిమపాతం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. తుఫాను రాష్ట్రవ్యాప్తంలో విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని అక్కడి వాతావరణశాఖ చెబుతోంది.

భారీ వర్షం కారణంగా లాస్ ఏంజెల్స్‌లో విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. కారు నీట మునిగి ఒకరు మృతి చెందినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.