అమెరికానా? ఇండియానా? - MicTv.in - Telugu News
mictv telugu

అమెరికానా? ఇండియానా?

August 28, 2017

నీట మునిగిన ఇళ్లు.. పొలాలు.. తెగిపోయిన రోడ్లు.. ఇవన్నీ చూస్తోంటే మన దేశంలోని ఏ బిహార్ లోనో, బెంగాల్లోనో తుపాను, వరదలు ముంచెత్తిన ప్రాంతాల్లా అనిపిస్తుంది.  కానీ ప్రకృతి పంజా విసిరితే భారతైన, అమెరికా అయినా.. మరే దేశమైనా చిగురుటాకులా అల్లాడిపోవాల్సిందే. ఇక్కడ మీరు చూస్తున్న వరద చిత్రాలన్నీ అమెరికాలోని హ్యూస్టన్ లోనిదే.. ఫొటోలను బాగా చూస్తే మీరే నమ్మేస్తారు..

హ్యూస్టన్ లో ‘హార్వే’ తుఫాను ధాటికి మామూలు ఇళ్లతోపాటు బహుళ అంతస్తుల భవనాలు కూడా నీట మునిగాయి. ఇప్పటివరకు ఐదుగురు చనిపోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. మంచినీరు, ఆహారం లేక అల్లాడిపోతున్నారు.

భవనాల టెర్రస్ లపై వందలాది మంది.. ‘సాయమో ట్రంపో..’ అని అర్థిస్తున్నారు. వందలమంది చేతికి దొరిక బల్లనో, పడవనో తీసుకుని వాననీటిలో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. పలు చోట్ల కార్లు, లారీలు నీటిలో మునిగిపోయాయి. సాయం కోసం హెల్ప్ లైన్లకు వేలకొద్దీ కాల్స్ వస్తున్నాయి. సైన్యం హెలికాప్టర్లలో పలువురిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

 

ఓ వృద్ధాశ్రమంలో మోకాలిలోతు నీటిలో వృద్ధులు పలు గంటల పాలు నానిపోతూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సైన్యం వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది.