Hurun India has released a list of Indian entrepreneurs have donated
mictv telugu

శివనాడార్ రోజుకు 3 కోట్ల విరాళం.. అదానీ ఎంతిచ్చాడంటే

October 20, 2022

Hurun India has released a list of Indian entrepreneurs have donated

దేశంలో బిలీయనీర్లు విరాళంగా ప్రకటించిన డబ్బును బట్టి ఎడెల్ గివ్ హురున్ ఇండియా అనే సంస్థ ఓ లిస్ట్ విడుదల చేసింది. ఇందులో రోజుకు మూడు కోట్ల రూపాయలు ఇచ్చిన హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివనాడార్ అగ్ర స్థానంలో నిలిచారు. వార్షికంగా చూస్తే రూ. 1161 కోట్లతో దానకర్ణుడు అనిపించుకున్నారు. 2022 ఏడాదికి గాను ఆ సంస్థ దాతృత్వ జాబితా రూపొందించింది.

రెండో స్థానంలో అజీమ్ ప్రేమ్ జీ రూ. 484 కోట్లతో ఉన్నారు. మూడో స్థానంలో రిలయన్స్ ముఖేష్ అంబానీ రూ. 411 కోట్లు ఇచ్చారు. ఇక ఆసియా కుబేరుడు గౌతం అదానీ ఏడో స్థానం సంపాదించుకున్నారు. మొత్తం రూ. 190 కోట్లు ఇచ్చి టాప్ టెన్‌లో నిలిచారు. అయితే మూడేళ్లకు కలిపి చూస్తే మాత్రం ఈ స్థానాలు మారుతున్నాయి. మొదటి స్థానంలో అజీం ప్రేమ్ జీ రూ. 18,101 కోట్లతో, శివనాడార్ రూ. 3,219 కోట్లతో రెండో స్థానం, రూ. 1446 కోట్లతో ముఖేష్ అంబానీ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఇందులోనూ వీరు దేనికి విరాళం ఇచ్చారో కూడా వివరాలు పొందుపరిచారు. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన శివనాడార్, అజీం ప్రేమ్ జీ, ముఖేష్ అంబానీలు తమ విరాళాలను విద్య కోసం కేటాయించారు. అదానీ మాత్రం ప్రకృతి విపత్తుల బారిన పడిన బాధితులను ఆదుకోవడానికి కేటాయించారు.

Hurun India has released a list of Indian entrepreneurs have donated