అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు కర్నాటక బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మహిళ బొట్టు పెట్టుకోకపోవడంతో నీ మొగుడు బతికే ఉన్నాడా అంటూ ఎంపీ మాట్లాడిన తీరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బెంగళూరుకు 70 కిలో మీటర్ల దూరంలో ఉన్న కోలార్ జిల్లాలో జరుగుతున్న ఓ జాతరను ఎంపీ మునిస్వామి సందర్శించారు. జాతర ప్రారంభించిన ఎంపీ బట్టలు విక్రయిస్తున్న స్టాళ్లను పరిశీలించారు. తన రౌండ్ల సమయంలో, అతను ఒక బట్టల స్టాల్ దగ్గర ఆగి, మహిళతో మాట్లాడారు.
ನಿನ್ನ ಗಂಡ ಬದುಕಿದ್ದಾನೆ ತಾನೇ?: ಹಣೆಗೆ ಬೊಟ್ಟು ಇಟ್ಟುಕೊಂಡಿಲ್ಲವೆಂದು ಮಹಿಳೆಯ ನಿಂದಿಸಿದ ಸಂಸದ ಮುನಿಸ್ವಾಮಿ#muniswamy pic.twitter.com/hvinI9VJ8T
— Prajavani (@prajavani) March 8, 2023
సదరు మహిళను నీ పేరేంటని అడిగిన మునిస్వామి అనంతరం ఆమె నుదుటన బొట్టు కనిపించకపోవడంతో నీ భర్త బతికే ఉన్నాడా అని వ్యంగ్యంగా మహిళను ప్రశ్నించాడు. మరి బొట్టు ఎందుకు పెట్టుకోలేదని మందలించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ కావడంతో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అందులోనూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ఈ సంఘటన చోటు చేసుకోవడంతో మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీసింది. ఎంపీ తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశాన్ని హిందుత్వ ఇరాన్‌గా బీజేపీ మారుస్తుందని కాంగ్రెస్ ఎంపీ కార్తీ పి చిదంబరం ట్వీట్ చేశారు.