భార్య చదువుపై కసి.. నమ్మించి వేళ్లు నరికాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

భార్య చదువుపై కసి.. నమ్మించి వేళ్లు నరికాడు..

May 8, 2019

చూడచక్కని జంట. కానీ అతనికి ఉన్మాదం తలకెక్కింది. ఎవరో నూరిపోయిన వెర్రి నమ్మాకాలు శాడిస్టుగా మార్చేశాయి. ఒళ్లు గగుర్పొడిచే నేరానికి తెగబడ్డాడు. నీకో సర్ ప్రైజ్ గిఫ్ట్ అంటూ.. ఆమె కళ్లకు గంతలు కట్టి చేతి వేళ్లు నరికేశాడు. అతని అనుమతి లేకుండా ఆమె డిగ్రీ చదువుకుంటానని చెప్పడమే ఈ ఘోరానికి కారణం. బంగ్లాదేశ్‌లో జరిగిందీ సంఘటన

Husband blindfolds his wife and then chops off her fingers to stop her studying for a degree

రఫీకల్ ఇస్లాం(30), హవా ఆక్తర్ (21) భార్యాభర్తలు. ఇస్లాం యూఏఈలో కార్మికుడు. ఎనిమిదో తరగతితో చదువు ఆపేశాడాడు. హవా బంగ్లాలో ఉంటోంది. డిగ్రీ చదువుకుంటోంది. చదువు ఆపేయాలని, లేకపోతే చంపేస్తానని అతడు బెదిరించాడు. మామూలు బెదిరింపులు అనుకుని మె చదువును కొనసాగించింది. ఇటీవల బంగ్లాదేశ్ వచ్చిన ఇస్లాం.. భార్య తన మాట వినకుండా చదువుకుంటోందని తెలుసుకున్నాడు. నీకో సర్ ప్రైజ్ గిఫ్ట్ అని ఆమె కళ్లకు గంతు కట్టి, నోటికి ప్లాస్టర్ అంటించాడు. తర్వాత కత్తి తీసుకని కుడి చేతి వేళ్లు నరికేశాడు. వాటిని ఓ బంధువు చెత్తకుప్పలో పడేశారు. బాధితురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు అతణ్ని అరెస్ట్ చేసి కేసు పెట్టారు. అంత ఘోరం జరిగిన హవా దృఢసంకల్పం చెక్కు చెదరలేదు. తాను ఎడమ చేత్తో రాయడం నేర్చుకుని చదువు పూర్తి చేస్తానంటోంది.