వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్యని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడో భర్త. అత్త చేసిన ఛాలెంజ్‌ను సవాలుగా తీసుకొని భార్య బండారం బయటపెట్టాడు. గ్రామపెద్దల సమక్షంలో ఇద్దర్ని తాళ్లతో కట్టేసి పోలీసులకు అప్పగించాడు. ఈ ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చిన్న బోయినపల్లిలో జరిగింది. పాయం పురుషోత్తం, చీమల సుమలత ఎనిమిదేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఉద్యోగ రీత్యా ఇద్దరు వేర్వేరు గ్రామాల్లో ఉంటున్నారు. సుమలత దొడ్ల గ్రామంలో బీట్ ఆఫీసర్‌గా పనిచేస్తోంది.
అయితే ఇటీవల భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తి అది కాస్తా.. గొడవలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో సుమలత తన ఇంటర్ క్లాస్మేట్ లింగరాజుతో సన్నిహితంగా మెలిగింది. విషయం తెలుసుకున్న భర్త పురుషోత్తం ప్రవర్తన మార్చుకోవాలని.. పలు మార్లు భార్యను హెచ్చరించాడు. అయినా ఆమె తీరులో మార్పు రాకపోవడంతో పెద్ద మనుషుల సమక్షంలోనే పంచాయితీ పెట్టించాడు. ఆ సమయంలో సుమలత తల్లి ఊరికే అనుమానించడం కాదని, నిజమైతే నిరూపణ చేయాలని సవాల్ విసిరింది. దీంతో పురుషొత్తం భార్యపై నిఘా పెట్టి.. ఓ ఇంట్లో సుమలత, లింగరాజుతో కలిసి ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఆ తర్వాత ఇద్దర్నీ పోలీసులకు అప్పగించాడు.