ప్రేమికుల రోజే భార్య చేతిలో దబిడి దిబిడి.. లవర్‌తో వెళ్లి - MicTv.in - Telugu News
mictv telugu

ప్రేమికుల రోజే భార్య చేతిలో దబిడి దిబిడి.. లవర్‌తో వెళ్లి

February 14, 2020

Bihar

స్వచ్ఛమైన ప్రేమకు నిర్వచనంగా ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు జరుపుకుంటున్నారు. ఈరోజు ఒకరిపై ఒకరు ఎక్కడలేని ప్రేమను కురిపిస్తూ శుభాకాంక్షలు చెప్పి బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటారు. అలాంటి ఈరోజున ఓ వ్యక్తి ప్రియురాలిని మోసం చేయాలని  చూశాడు. ఆమెను తీసుకుని ఓ షాపింగ్ మాల్‌కు వెళ్లాడు. అక్కడికి వచ్చిన అతని భార్య.. భర్త అని కూడా చూడకుండా అంతమందిలో అతని దుమ్ము దులిపింది. ఆగ్రహంతో ఊగిపోతూ కొట్టింది. ప్రియురాలిని కూడా పట్టుకుని ఈడ్చి కొట్టింది. దీంతో సదరు ప్రియురాలికి కళ్లు బైర్లు కమ్మినంత పని అయింది. పెళ్లి కాలేదని ఆమెకు అబద్ధం చెప్పి ప్రేమికుల రోజును కోలుకోలేని షాక్ ఇచ్చాడు. బీహార్‌లో ఈ ఘటన వెలుగు చూసింది.

ప్రియురాలిని తీసుకుని చక్కగా వాలెంటైన్స్ డే సెలబ్రేషన్స్‌కు వెళ్లాడు. బహుమతులు ఇచ్చాడు. ఎన్నో కబుర్లు చెప్పాడు. ఆహా ఈ ప్రేమికుల రోజు నిత్యం ఉంటే బాగుండు అనుకుంది సదరు ప్రియురాలు. కానీ, ఆమె సంతోషం ఎంతో సేపు నిలవలేదు. సదరు ప్రియుడి భార్య అక్కడికి వచ్చి ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్టు వారి చెమడాలు ఒలిచినంత పనేచేసింది. అమ్మోరిలా ఊగిపోయి భర్త అని కూడా చూడలేదు. చడామడా ఉతికి ఆరేసింది. భార్య ఆకస్మిక రాకతో ఆ భర్త షాక్ నుంచి తేరుకోలేకపోయాడు. మూడేళ్ల క్రితం ఈ వెధవను పెళ్లి చేసుకున్నానని, తమకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని ఆ భార్య చెప్పింది. దీంతో అతని వెంట వచ్చిన ప్రియురాలు షాక్ అయింది. ఇప్పుడు తన ముఖం చూడకుండా మరో యువతితో ప్రేమాయణం నడిపిస్తున్నాడని ఆరోపించింది. పది మందిలో పట్టుకుని భార్య చావబాదడంతో ఆ భర్త సిగ్గుతో తల దించుకున్నాడు.