భార్యను వదిలించుకోవడం కోసం హెచ్ఐవీ ఇంజెక్షన్ ఇచ్చిన భర్త - MicTv.in - Telugu News
mictv telugu

భార్యను వదిలించుకోవడం కోసం హెచ్ఐవీ ఇంజెక్షన్ ఇచ్చిన భర్త

September 14, 2021

కట్టకున్న భార్యను కలకాలం క్షేమంగా చూడాల్సిన భర్తే కర్కోటకుడిగా మారాడు. నమ్మి వచ్చిన అర్ధాంగి ఆరోగ్యాన్ని అర్ధాంతరంగా ముగించాలనుకున్నాడు. అతని పేరు మహేష్ గౌతమ్. ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ లో ఓ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నిషియన్ గా కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్నాడు. 2020లో అతనికి వివాహం జరిగింది.అయితే అదే ఆసుపత్రిలో పనిచేసే మరో ఉద్యోగినితో మహేష్  కు వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలియడంతో భార్య అతనిని నిలదీసింది.

అప్పటికే మహేష్ భార్య గర్భవతి. ప్రియురాలిని వదులుకోవడానికి ఇష్టపడని మహేష్ వేదమంత్రాల సాక్షిగా పరిణయమాడిన భార్యను వదిలించుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు.గర్భిణి అని చూడకుంగా విడాకులు కావాలంటూ ఆమెను తీవ్రంగా ఒత్తిడి చేసేవాడు. ఎంత ఒత్తిడి చేసినా ఆమె విడాకులకు ససేమిరా ఒప్పుకోకపోవడంతో కర్కోటకుడిగా మారాడు.ఓ హెచ్ఐవీ రోగికి ఇచ్చిన ఇంజెక్షన్ ను అలాగే తీసుకువచ్చి భార్యకు గుచ్చాడు.తర్వాత ఈ విషయం అతని భార్యకు తెలిసింది.

దాంతో ఆమె తన కుటుంబ సభ్యుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.