husband kidnapped her sister in law in hanmakonda
mictv telugu

వరంగల్ : భార్యపై కోపంతో మరదలి కిడ్నాప్.. 20 రోజులైనా దొరకట్లేదు

August 1, 2022

తెలంగాణలోని హనుమకొండలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య కాపురానికి రావట్లేదన్న అక్కసుతో భర్త తన భార్య చెల్లెలిని కిడ్నాప్ చేశాడు. 20 రోజులైనా వారిద్దరి ఆచూకీ తెలియరాలేదు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదంటూ బాలిక తల్లి హెచ్ఆర్సీని ఆశ్రయించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మడికొండకు చెందిన మైనర్ బాలిక సిరి (15) కిడ్నాప్ అయింది. 20 రోజుల క్రితం ఆ బాలిక చదువుతున్న పాఠశాలకు వెళ్లిన ఆమె బావ (అక్క భర్త) మధు ఆమెను బైక్‌పై ఎక్కించుకొని తీసుకెళ్లిపోయాడు. తర్వాత తన ఫోన్ స్విచాఫ్ చేసుకున్నాడు. దీంతో ఆందోళనకు లోనైన బాలిక తల్లి పోలసులకు కంప్లైంట్ ఇవ్వగా వారి విచారణలో మధు బాలికను తీసుకొని హైదరాబాద్ వైపు వెళ్లినట్టు తేలింది. హైవేపై ఉన్న టోల్‌ప్లాజా సీసీకెమెరాల్లో ఈ మేరకు రికార్డయింది. అయితే ఇప్పటివరకు బాలిక ఆచూకీ తెలియకపోవడంతో అక్కమీద కోపంతో బావ మధు బాలికను చంపేసి ఉంటాడని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే కాజీపేట పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని హెచ్ఆర్సీని మొరపెట్టుకున్నారు. కాగా, బైక్‌పై వెళ్తున్న మధు, సిరిల వీడియోను పోలీసులు విడుదల చేశారు.