చనిపోతున్నానంటూ భర్త వీడియో కాల్.. సరేనంటూ తలూపిన భార్య - MicTv.in - Telugu News
mictv telugu

చనిపోతున్నానంటూ భర్త వీడియో కాల్.. సరేనంటూ తలూపిన భార్య

April 25, 2022

ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఐదురోజుల క్రితం జరిగింది. ఇందుకు సంబంధించిన భర్త వీడియో కాల్ బయటపడడంతో ఈ విషయం పోలీసులకు తెలిసింది. వివరాలు.. భోపాల్‌లోని కోలార్ ప్రాంతంలో నివాసం ఉండే ప్రాపర్టీ డీలర్ వినయ్ రజక్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకు ముందు భార్యకు వీడియో కాల్ చేసి ‘నేను చనిపోతున్నా. నా చావుకు కారణం నువ్వు, నీ తల్లిదండ్రులు, నీ కుటుంబసభ్యులే కారణం. నన్ను మానసికంగా, శారీరకంగా వేధించారు. బాగా బతకాలనుకున్న నాకు మీ హింస వల్ల కుదరలేదు’ అంటూ మాట్లాడాడు. తాను చనిపోతున్నా అన్నప్పుడు భార్య ఆర్తి సరేనంటూ తల ఊపింది. ఇదంగా వీడియోలో రికార్డయింది. వినయ్ చనిపోయే ముందు ఈ వీడియోను తన కుటుంబ సభ్యులకు పంపించాడు. అనంతరం వినయ్ అంత్యక్రియలకు కూడా భార్య, ఆమె కుటుంబ సభ్యులు ఎవ్వరూ హాజరు కాలేదు. దీంతో వినయ్ బంధువులు వీడియో ఆధారంగా ఆర్తి కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేయగా, పోలీసులు ఆర్తితోపాటు ఆమె కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.