Husband Nirwakam..Romance at the age of 89, finally
mictv telugu

భర్త నిర్వాకం..89 ఏళ్ల వయసులో శృంగారం, చివరికి

September 13, 2022

శృంగారం కోసం 89 ఏళ్ల వయసున్న తన భర్త..తనను పదేపదే వేధిస్తున్నాడని, తనకు నచ్చిన విధంగా శృంగారంలో పాల్గొనాలని డిమాండ్ చేస్తున్నాడని 87 ఏళ్ల వయసున్న ఉన్న ఓ భార్య వాపోయింది. రోజు రోజుకి అతని హింసను భరించలేక ఆమె..పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును స్వీకరించినా అధికారులు ఇంటికి చేరుకొని, ఆ వృద్దుడికి కౌన్సెలింగ్ ఇచ్చి, ఆ వృద్ధురాలికి ఆమె భర్త నుంచి వేధింపులు తగ్గేలా ఓ మార్గాన్ని సూచించారు.

వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్‌ రాష్ట్రంలోని వదోదరలో నివాసముంటున్న ఓ 87 ఏళ్ల భార్య.. తన భర్త తనను శృంగారంలో పాల్గొనాలని పదేపదే వేధిస్తున్నాడని హెల్ప్‌లైన్‌ను ఆశ్రయించింది. దీనిపై స్పందించిన అధికారులు..ఆ వృద్ధ దంపతులకు యోగా మార్గాన్ని చూపించారు. ఆ తర్వాత ఆ వృద్ధురాలికి భర్త నుంచి వేధింపులు తగ్గాయని అధికారులు వివరాలను వెల్లడించా రు.

”గుజరాత్‌లో మహిళల కోసం ‘181 అభయం’ పేరుతో ప్రభుత్వం టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. తాజాగా ఓ వృద్ధురాలి నుంచి ఫోన్ వచ్చింది. సెక్స్ కోసం ఆమె భర్త తీవ్ర స్థాయిలో వేధిస్తున్నాడని, దాన్ని నిరాకరిస్తున్నందుకు ఆమెపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాడని వాపోయింది. అంతేకాదు, ఆమె అనారోగ్యంతో ఉన్నానని, అలసటగా ఉందని ఎన్నిసార్లు చెబుతున్నా ఆయన పట్టించుకోవడం లేదని తెలిపింది. దాంతోొ ‘అభయం’ బృందం.. ఆ వృద్ధ జంట ఇంటికి చేరుకుంది. కౌన్సెలింగ్ ఇచ్చింది. యోగాను అభ్యసించాలని, మతపరమైన ప్రదేశాలను సందర్శించాలని వృద్దుడికి సూచించింది. ఆలోచనలను ఇతర అంశాలపైకి మళ్లించేందుకు సీనియర్ సిటిజన్ల గార్డెన్లు, పార్కులను సందర్శించాలని సూచించింది. మొత్తం మీద ఈ సూచనలు పనిచేశాయి. ప్రస్తుతం ఆ వృద్దుడు ఆమెను వేధించడం తగ్గించాడు. ఇద్దరు ఆనందంగా ఉన్నారు” అని అధికారులు తెలియజేశారు.