చపాతీ తెచ్చిన పంచాయితీ.. కర్ణభేరి పగిలిపోయింది - MicTv.in - Telugu News
mictv telugu

చపాతీ తెచ్చిన పంచాయితీ.. కర్ణభేరి పగిలిపోయింది

June 1, 2022

సాధారణంగా చాలా ఇళ్లల్లో అత్తా కోడళ్ల మధ్య చిన్నపాటి గొడవలు జరుగుతుంటాయి. కాసేపటికే మళ్లీ వారు కలిసిపోతుంటారు. కానీ మహారాష్ట్రలో జరిగిన ఓ అత్తాకోడలు మధ్య గొడవ.. కోడల్ని ఆసుపత్రి పాలు చేసింది. అసలు ఆ గొడవకు కారణం ఏంటంటే చపాతి బాగా చేస్తావా? అని అడగడం. అసలేమైందంటే? బద్లాపూర్‌ సమీపంలో గల షిర్‌గావ్ లోని మౌలీచౌక్ లో అశ్విన్ నికుంభ్ కుటుంబం నివసిస్తోంది. సోమవారం రాత్రి అతడి భార్య కోమల్ (22) వంటగదిలో భోజనం సిద్ధం చేస్తోంది. ఆ సమయంలో ఆమె అత్త వచ్చి చపాతీ బాగా చేస్తావా? అని అడిగింది. ఆ ప్రశ్నకు ఆమె కాస్త వెటకారంగా.. ‘మా అత్తగారిని దృష్టిలో పెట్టుకుని మంచిగానే తయారు చేస్తాను’ అని చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ గొడవ విన్న అశ్విన్ తన భార్య కోమల్ ఎడమ చెవిపై రాయితో బలంగా కొట్టాడు. దీంతో ఆమె కర్ణభేరి పగిలింది. అంతటితో ఆగకుండా బెల్టుతో కూడా కొట్టాడు. వెంటనే ఆమె పోలీస్ స్టేషన్‌కు చేరుకుని, భర్త అశ్విన్‌పై ఫిర్యాదు చేసింది. అతనిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.