భార్య, ఇద్దరు కూతుళ్లను అమ్మకానికి పెట్టిన భర్త - MicTv.in - Telugu News
mictv telugu

భార్య, ఇద్దరు కూతుళ్లను అమ్మకానికి పెట్టిన భర్త

May 20, 2019

Husband tried to sold his wife and two daughters in hyderabad.

హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చిందన్న కోపంతో భార్య, కూతుళ్లను 3 లక్షలకు అమ్మకానికి పెట్టాడో భర్త. వివరాల్లోకి వెళితే ఫజల్‌ రహ్మాన్‌(25), ఇజరత్‌ పర్వీన్‌(22)లకు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు సంతానం. కొడుకు పుట్టలేదన్న కోపంతో ఫజల్‌ ఆమెను రోజూ వేధించేవాడు. పథకం ప్రకారం మూడు నెలల క్రితం షాద్‌నగర్‌లో బంధువుల వివాహం ఉందని చెప్పి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. ఫోన్‌ చేస్తే సమాధానం ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నారు.

అప్పటి నుంచి పర్వీన్‌ తన పిల్లలతో ఇంట్లో ఉంటోంది. కాగా, మూడు రోజుల క్రితం బేగంపేటకు చెందిన సర్ఫరాజ్‌, అమ్జాద్‌ ఖాన్‌, మరో వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డారు. ఫజల్‌ నిన్ను, ఇద్దరు పిల్లలను 3 లక్షలకు అమ్మేశాడని చెప్పి ఆమెను, పిల్లలను కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించగా ఆమె కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకొని పోలీస్ కంట్రోల్ రూమ్‌కి ఫోన్‌ చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకుండా వదిలేశారని బాధితురాలు తెలిపారు. కిడ్నాప్‌ చేసేందుకు వచ్చిన వారు, భర్త, అత్తమామలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది.