భార్య కాళ్ళు మొక్కిన భర్త...! - MicTv.in - Telugu News
mictv telugu

భార్య కాళ్ళు మొక్కిన భర్త…!

September 15, 2021

భార్యాభర్తలు ఇద్దరూ సమానమే అని, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదని నిరూపించాడు ఒక వరుడు. వేదమంత్రాల సాక్షిగా, సంప్రదాయ బద్ధంగా పెళ్ళాడిన తర్వాత వధువు వచ్చి భర్త కాళ్ళు తాకి ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుంది.ఇది సాధారణంగా ప్రతీ పెళ్ళిలో జరిగే తంతు.ఇది తరతరాలుగా మనం పాటిస్తూ వస్తున్న ఆచారం కూడా. ఈ ఆచారానికి సరికొత్త నిర్వచనం ఇచ్చాడు ఈ వరుడు.భార్య తన పాదాలు తాకి ఆశీర్వాదం తీసుకుందని, తాను కూడా తన భార్య పాదాలు తాకి ఆశీర్వాదం తీసుకున్నాడు.

 

 

View this post on Instagram

 

A post shared by Piyush Awchar (@mr_robin_hudd)

భార్యకు గౌరవమివ్వాలి, ఆమెకు తగినంత ప్రాధాన్యతనివ్వాలి , ఇద్దరూ సమానమే అని తెలియజేయడానికి  ఉద్ధ్యేశపూర్వకంగానే ఈ పని చేసినట్లు తెలుస్తోంది.పైగా వీళ్ళిద్దరిది ప్రేమ వివాహం. వరుడు చేసిన ఈ పనికి నెటిజన్లందరూ ఫిదా అవుతున్నారు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని అభినందనలు తెలుపుతున్నారు. ఈ వీడియో నెట్టింటా తెగ వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఈ వీడియోను ” లవ్ మ్యారేజ్ ” అనే క్యాప్షన్ తో షేర్ చేస్తున్నారు.