Husbands are embryos while wives are alive..Do you know why?
mictv telugu

బతికే ఉన్న భార్యలకు పిండాలు పెట్టిన భర్తలు…

September 19, 2022

ప్రస్తుత సమాజంలో కొన్ని ఆచారాలను, నమ్మకాలను, సంప్రదాయాలను, కట్టుబాట్లను చూసినప్పుడు, వాటి గుర్చి విన్నప్పుడు చాలా విచిత్రంగా అనిపిస్తుంటుంది. ఈరోజుల్లో కూడా ఇలాంటివి ఆచారించే వాళ్లు, నమ్మేవాళ్లు కూడా ఉన్నారా? అని సందేహం వేస్తుంది. తాజాగా ముంబైలో జరిగిన ఓ సంఘటన ఇలాంటిదే. ప్రస్తుతం ఈ ఘటన దేశవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. భార్యలు బతికుండగానే 50 మంది భర్తలు పిండాలు పెట్టారు. ఇలాంటి ఆచారం కూడా ఉందా! అనే అనుమానం మీలో కలుగవచ్చు. మరి భార్యలు బతికుండగానే పిండాలు ఎందుకు పెట్టారో ఆ భర్తల మాటల్లోనే తెలుసుకుందాం పదండి..

ముంబైలోని బంగంగా నది ఒడ్డున ఆదివారం రోజున పితృపక్షం, శ్రాద్ధ మాసం జరిగింది. ఈ మాసంలో ప్రతి సంవత్సరం ముంబై ప్రజలు చనిపోయిన వారికి పిండ ప్రదానం చేస్తారు. విచిత్రం ఏంటంటే..ఈ ఏడాది దాదాపు 50 మంది జీవించి ఉన్న తమ భార్యల పేరిట దానం చేస్తూ, కనిపించారు. వివాహానికి సంబంధించిన చెడు జ్ఞాపకాలను వదిలించుకోవడానికి వీరంతా పూర్తి ఆచార సాంప్రదాయాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వీరిలో కొందరు గుండు కూడా చేయించుకున్నారు. ఈ పిండ ప్రదాన కార్యక్రమాన్ని వాస్తవ్ పౌండేషన్ యాజమాన్యం నిర్వహించింది.

”ఇలా పిండ ప్రదానం చేస్తే.. భార్యలు శాంతించి, మాకు విముక్తి కల్పిస్తారు. పెళ్లిలో దంపతులు ఏడడుగులు వేసి కలిసి నడుస్తామని ప్రమాణం చేస్తాం. కానీ, చాలా జంటలు పెళైన కొద్ది రోజులకే వివాదాలతో కోర్టుమెట్లు ఎక్కుతున్నాయి. విడాకుల కోసం కోర్టుల చుట్టు తిరిగినా, మహిళలకే మద్దతు వస్తోంది. అందుకే భార్యా బాధిత భర్తలంతా కలిసి ఈ పిండ ప్రదానం చేస్తున్నాం. గతంలో ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారణాసిలోనూ ఈ కార్యక్రమం జరిగింది. ఈసారి ముంబైలో ఈ పిండ ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమం వల్ల స్త్రీ వాదమనే విషానికి కూడా తర్పణం వదులుతుంది. స్త్రీ వాదానికి ముగింపు పలికి, సమాజంలో సమానత్వం వస్తుంది” అని భార్యల బాధితులు తెలిపారు.