husband's last rites were stopped by a fight between his two wives in korutla
mictv telugu

ఆస్తి కోసం భార్యల కొట్లాట.. ఆగిపోయిన మాజీ సర్పంచ్ అంత్యక్రియలు

July 7, 2022

కట్టుకున్న భర్త కన్నుమూయగానే.. అతని ఆస్తి కోసం అతని ఇద్దరు భార్యలు కొట్లాడుకున్నారు. ఆస్తి పంపకాల్లో తాడో పేడో తేల్చుకోవాలని, భర్త శవాన్ని ఇంటి ముంగిటే వదిలేసి రిజిస్ట్రార్ ఆఫీస్ కు చేరుకున్నారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలో చోటుచేసుకుంది.

మండలంలోని అయిలాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ మామిడాల నర్సింహులు (55) అనారోగ్య కారణాల వల్ల మృతి చెందాడు. ఈయనకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య పేరిట కొంత ఆస్తి ఉంది. అందులో కొంత భాగాన్ని తన పేరు మీద రాసే వరకు అంత్యక్రియలు జరపడానికి వీల్లేదని రెండో భార్య మొండికేసింది. దీంతో ఇద్దరూ గొడవపడ్డారు. ఆస్తి పంపకాల కోసం ఇద్దరు భార్యలు మృతదేహన్ని కోరుట్ల పట్టణం ప్రకాశం రోడ్డులోని ఇంటి వద్ద వదిలేసి కథలాపూర్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లారు.