భార్యలను మార్చుకున్న భర్తలు.. చివరకు కోర్టులో కేసు - MicTv.in - Telugu News
mictv telugu

భార్యలను మార్చుకున్న భర్తలు.. చివరకు కోర్టులో కేసు

March 25, 2022

bbbbbbn

ఉత్తరప్రదేశ్‌లోని లక్నో ఫ్యామిలీ కోర్టుకు ఓ విచిత్రమైన కేసు వచ్చింది. ఇద్దరు చిన్ననాటి స్నేహితులు పెద్దయ్యాక, పెళ్లి చేసుకొని భార్యలను మార్చుకున్నారు. కానీ, మధ్యలో బెడిసికొట్టడంతో వివాదం కోర్టుకు చేరింది. స్థానికంగా సంచలనం సృష్టిస్తోన్న ఈ కథనం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. చందు, నందులు చిన్ననాటి స్నేహితులు. పెరిగి పెద్దయ్యాక కూడా తమ స్నేహాన్ని అలాగే కాపాడుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో ఇద్దరికీ పెళ్లయింది. ఈ క్రమంలో ఇద్దరికీ ఓ తల తిక్క ఆలోచన వచ్చింది. అదే ఇద్దరూ తమ భార్యలను మార్చుకోవాలని. వింతేమిటంటే వీరి మాటకు భార్యలు కూడా ఓకే చెప్పటం. ఇలా ఎన్నోసార్లు తమ భార్యలను మార్చుకునేవారు. కొంతకాలం గడచింది. నందు భార్య చందుపై ఇష్టాన్ని పెంచుకుంది. దీంతో భరించలేని నందు తన భార్య నుంచి విడాకులు కావాలంటూ కోర్టులో కేసు వేశాడు. తన భార్య క్రూరంగా వ్యవహరిస్తోందనీ, ఆమెతో కలిసి జీవించలేననీ, విడాకులు కావాలంటూ పట్టుబట్టాడు. ఈ నేపథ్యంలో వాయిదాలు, వాదోపవాదాల అనంతరం భార్యల మార్పిడి విషయం బయటపడింది. పరస్పర అంగీకారంతోనే మార్పిడి జరిగినందును కోర్టులో లాయర్లు, జడ్జీలు తలలు పట్టుకున్నారు. అత్యంత క్లిష్టంగా మారిన ఈ కేసును ఎలా పరిష్కరించాలో అర్ధంకాక జుట్టు పీక్కుంటున్నారు. ఈ విషయంపై ఓ సీనియర్ లాయర్ మాట్లాడుతూ.. ఇది సాధారణ కేసు కాదన్నారు. భార్యల మార్పిడి చేసుకున్న ఇలాంటి స్వభావమున్న వ్యక్తులు సాధారణంగా నిజాలు మాట్లాడరని తేల్చి చెప్పారు. ఇప్పటికి విషయం బయటపడినా ఎలా ఎదుర్కోవాలో మేమూ తీవ్రంగా ఆలోచిస్తున్నామని వెల్లడించారు. కాగా, ఇలాంటి ఘటనే కేరళలో జరిగింది. దాదాపు వెయ్యి మంది బాగా పేరున్న వాళ్లు ఇలాంటి పనే చేశారు. పాశ్చాత్య సంస్కృతి మూలంగా ఇలాంటి అనర్ధాలు జరుగుతున్నాయని సాంప్రదాయ వాదులు ఆరోపిస్తున్నారు.