భార్య శృంగారానికి ఒప్పుకోలేదని చంపేశాడు - MicTv.in - Telugu News
mictv telugu

భార్య శృంగారానికి ఒప్పుకోలేదని చంపేశాడు

November 20, 2017

దేశంలో మహిళలపై చెప్పలేనన్ని ఘోరాలు జరుగుతున్నాయి. బయటివాళ్లే కాకుండా ఇంట్లోని వాళ్లూ ఆమెను కాటేస్తున్నారు. భార్య శృంగారానికి ఒప్పుకోలేదని ఒక మృగాడు ఆమెను గొంతునులిమి హత్య చేశాడు ఓ భర్త. ఈ ఘోరం హరియాణాలోని జోగ్నా ఖేరా రామంలో జరిగింది.

సంజీవ్ కుమార్, సుమన్ దంపతులు. వీరీకి పెళ్లయి పదేళ్లయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సంజీవ్‌కు ఇటీవల డెంగీ వ్యాధి సోకింది. వైద్యుల సలహామేరకు సుమన్.. దాంపత్యజీవితానికి దూరంగా ఉంటోంది. ఇటీవల సంజీవ్ ఆమెను శృంగారంలో పాల్గొనాలని బలవంతం చేశారు. ఆమె వారించింది. అయినా అతడు ఆమెపైన లైంగికదాడికి దిగాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో ఆగ్రహంతో గొంతునులిమి చంపేశాడు. విచారణలో సంజీవ్ తన నేరాన్ని అంగీకరించాడని కురుక్షేత్ర పోలీసులు చెప్పారు. పోలీసులు అతణ్ని అరెస్ట్ చేశారు.