హైదరాబాద్‌ను ప్రశ్నిస్తున్న పసికందు మృతదేహం   - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌ను ప్రశ్నిస్తున్న పసికందు మృతదేహం  

December 12, 2017

హైదరాబాద్ నడిబొడ్డున విషాదం.. హుస్సేన్ సాగర్‌లో మంగళవారం పసికందు మృతదేహం బయటపడింది. సచివాలయం దగ్గర్లో.. ఎన్టీఆర్ ఘాట్ ఎదురుగా సాయంత్రం నీటిలో ఓ ప్లాస్టిక్ కవర్ తేలాడుతూ కనిపించింది. వాసన వస్తుండడంతో అక్కడి నుంచి వెళ్తున్నవారు కొంచెం దగ్గరికి వెళ్లి చూశారు. అందులో ఒ బాలుడి మృతదేహం ఉన్నట్లు కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు, బల్దియా సిబ్బంది అక్కడి చేరుకుని బాలుడి మృతదేహాన్ని తీయించారు. శిశివును ఎవరో కవర్లో చుట్టి నీటిలో పడేసిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. వదలించుకోవడానికి పడేసి పోయారా? లేకపోతే చనిపోయాడని వదిలేసి పోయారా అన్నది తెలియడం లేదు.  పోలీసులు అనుమానాస్పద మృతికింద కేసు నమోదు చేశారు.