అడ్డుకుంటున్నారని హైకోర్టుకెక్కిన తీన్మార్ మల్లన్న..  - MicTv.in - Telugu News
mictv telugu

అడ్డుకుంటున్నారని హైకోర్టుకెక్కిన తీన్మార్ మల్లన్న.. 

October 9, 2019

Huzur nagar  .....

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలకు గడువు దగ్గర పడుతుండడంతో అభ్యర్థులు ప్రచార జోరును పెంచేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతున్నారు. ఈ నెల 18న కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొననున్నారు. స్వతంత్ర అభ్యర్థులు కూడా ప్రచారం తమ శక్తికి మేర ప్రచారం చేస్తున్నారు. పోలీసులు తన ప్రచారానికి ఆటంకాలు కల్పిస్తున్నారని తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్ కుమార్) ఈసీకి లేఖ రాశారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని, తనకు రక్షణ కల్పించాలని కోరారు. 

ఆయన దీనిపై హైకోర్టులోనూ హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ, ఎలక్షన్ కమిషనర్, హుజూర్ నగర్ ఎస్ఐలను ప్రతివాదుగా పేర్కొన్నారు. పోలీసులు తనను అడ్డుకుంటున్నారని, మూడు అక్రమ కేసులు బనాయించారని తెలిపారు. ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకోకుండా పోలీసులను ఆదేశించాలని కోరారు. దీనిపై ప్రస్తుతం కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. తెలంగాణ టీవీ, సోషల్ మీడియా ప్రేక్షకులకు తీన్మార్ మల్లన్నగా పరిచమున్న నవీన్ అగ్గిపెట్టె గుర్తుపై పోటీ చేస్తున్నారు.