తెలంగాణలో ప్రజాస్వామ్యానికి, పత్రికా స్వేచ్ఛకు రక్షణ లేకుండా పోయిందని హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. సీఎం కేసీఆర్ అన్ని పత్రికలను, టీవీ, యూట్యూబ్ చానళ్లను కొనేసి ప్రతిపక్షాల వాణిని వినిపించకుండా చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ కొనేసిన మీడియా తనపై ఎంత దుష్ప్రచారం చేసినా తాను గెలిచానని అన్నారు.