హైదరాబాద్ రోడ్ల పైకి రాడార్లు - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్ రోడ్ల పైకి రాడార్లు

June 14, 2017


‘ వేగం వద్దు ప్రాణాలు ముద్దు ’ అని రోడ్లెంట ఎన్ని ప్లెక్సీలు పెట్టి చెప్పినా ఎవ్వరూ విని మెల్లగా పోయే సిట్యుయేషన్లో లేరు. ఎందుకంటే బైకేసుకొని రోడ్డు మీదికొచ్చే ప్రతీవాడు హీరోనె. ఎక్స్ లేటర్ పట్టుకొని రేస్ చేస్తే నా సామిరంగా వన్ ట్వెంటీ, వన్ ఫిఫ్టీ, ఇంకా దూలెక్కువైతే టూ హండ్రెడ్ స్పీడ్ లో కూడా దూసుకుపోతున్నారు ప్రెజెంట్ జెనరేషన్. వీళ్ళ స్పీడును అందుకోవడం ఎవ్వరి తరం కాదు. మన యూత్ అన్నింటా కాంప్రమైజ్ అయినా స్పీడ్ లో మాత్రం అస్సలు కాంప్రమైజ్ కారు. కుర్రకారు స్పీడు, యమ జోరు, హోరు హోరు..జనం బేజారు బేజారు.., స్పీడుకు తగ్గట్టు ఇప్పడు హార్లీ డావిడ్సన్ బుల్లెట్ల డుడుడుడుడు సౌండ్లతో రోడ్లు లొల్లి లొల్లి అవుతున్నాయి.

రోడ్ల మీద వాళ్ళ స్పీడుకు యాక్సిడెంటై కొందరు అమాయకులు బలౌతున్నారు !? ఎదుగ ఈ హైదరాబాదులోనైతే బుల్లెట్ రైడర్లు మితిమీరిపోతున్నారు. ఒకర్ని చూసి ఒకరు ఫ్యాషన్‌లా ఫాలో అవుతున్నారు. సినిమాల్లో హీరో హీరోయిన్ను కాపాడుకోవడానికి స్పీడుగా వెళ్తాడు కానీ ఇక్కడ మనోళ్ళు ఆ హీరోగారి స్పీడును ఇన్సి పిరేషన్ గా తీస్కొని, ఎవర్ని కాపాడే పనే వుండదు, పోనీ అక్కడేమైనా కొంపలంటుకునే పని కూడా పెద్దగా వుండదు కానీ తగ్గరు.. గాల్లో తేలిపోతుంటారు. సినిమాల్లో హీరో చేసే రైడింగ్ నిజమైందేనా అంటే అదీ కాదు ? ఎందుకంటే షూటింగ్ సందర్భాల్లో వాళ్ళెన్ని జాగ్రత్తలు తీస్కొని ఎన్ని టేకులో కేకుల్లా తిని షూట్ చేసి ఎడిట్‌లో మాయ చేసి, దానికి రీరికార్డింగ్‌లో ఫాస్ట్ మ్యూజిక్ యాడ్ చేసి చూపిస్తే మన వెర్రి జనాలు వాటిని ఇన్సి పిరేషన్ గా తీస్కొని రోడ్ల మీద రైడర్లుగా చెలరేగిపోతున్నారు.

ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ! ? అలా తమ విలువైన ప్రాణాలు పోగొట్టుకున్నవారిలో రీసెంటుగా ఆంధ్రా మంత్రి నారాయణ కొడుకు నిషీతే గాకుండా గతంలో మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ కొడుకు, కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కొడుకు, నటుడు కోట శ్రీనివాసరావు కొడుకు.., ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది హై స్పీడుకు బలైనవారే ?? అలా బలి కాకుండా వుండాలంటే ఏం చెయ్యాలనే క్వశ్చన్ కి ఆన్సరే రాడర్లు.
అతి త్వరలోనే మన హైదరాబాదు నగరంలోకి రానున్నాయి. ఇవి రోడ్డుకి అటు పక్క ఇటు పక్క రెండు వైపులా కెమెరాల్లానే ఫిక్స్ అయి వుంటాయి. ఆయా ప్రాంతాల లిమిట్ స్పీడును దాటి ఎవరు అతిక్రమించినా వెంటనే అవి వాహనం నంబరుని రికార్డు చేసి వెంటనే కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కు పంపించడంతో సదరు స్పీడున్నోడకి చలాన్ ఛడుల్లుమని చెంప మీద ఈడ్చి కొడుతుందన్నమాట. అయితే ఇవి ఇంకా నగరంలోకి రాలేవు. త్వరలోనే వస్తాయంట. అప్పటిదాకా స్పీడును కనుక్కునే లేజర్ గన్ లను వాడుతున్నారు. నిజంగా రాడర్లు గనక వస్తే చాలా మంది పాదాచారులు నిరభ్యంతరంగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళొచ్చు. యూతందరు దెబ్బకు తమ వాహనాల స్పీడును తగ్గించుకొని తమ కెరీర్‌ని స్పీడుగా పరుగెత్తించుకుంటారేమో !?
రాడర్లు వస్తే నిజంగా చాలా మంది కంట్రోల్లోకొచ్చే సూచనలు కన్పిస్తున్నట్టే వున్నాయి. అప్పుడే రోడ్డు మీద మనం ఎంత జాగ్రత్తగా వెళ్తున్నా ఆ వచ్చేవాడు స్పీడు కంట్రోల్ తప్పి వచ్చి గుద్దకుండా కంట్రోల్లో వుంటారన్న మాట.