ఢిల్లీ మెట్రోను ఆదర్శంగా తీసుకోకండి.... అంతే సంగతులు.. - MicTv.in - Telugu News
mictv telugu

ఢిల్లీ మెట్రోను ఆదర్శంగా తీసుకోకండి…. అంతే సంగతులు..

November 24, 2017

ఇంకో మూడు నాలుగు రోజుల్లో హైదరాబాద్ ల మెట్రో రైలు మొదలైతది. సిటీల రోజురోజుకు ఎక్కువ అవుతున్న ట్రాఫిక్ ఫికర్, కాలుష్యాన్ని మెట్రో తగ్గిస్తదని ప్రభుత్వం నమ్ముతుంది. ఢిల్లీ మెట్రో లెక్క ఎక్కువ మందికి అందుబాటులో ఉండేలా హైదరాబాద్ మెట్రోను విస్తరించాలని ఆలోచిస్తుంది. ఈలోపు ఈ ఫస్ట్ ఫేజ్ మెట్రోను ప్రధానమంత్రితోని ధూంధాంగా షురూ చేయించాలని సిఎం కేసీఆర్ చూస్తున్నడు. ఓ దిక్కు ఆ ఏర్పాట్లు అవుతుంటే మరోదిక్కు మెట్రో టికెట్ రేట్ ఎంత ఉండాలన్న దానిపై అధికారులు కూసోని మాట్లాడుకుంటున్నరు. అయితే టికెట్ రేట్ తక్కువగ ఉండాలంటున్నరు జనం. కాదని ఎక్కువ రేట్ పెడితే ఢిల్లీ లెక్కనే అయితదంటున్నరు.పోయిన నెల అక్టోబర్ ల ఢిల్లీ మెట్రో టికెట్ రేట్లను సెంట్రల్ సర్కార్ మస్తు పెంచింది.కామన్ మ్యాన్ కొనలేనంత కాస్ట్లీ అయింది. దీంతోని రోజుకు మూడు లక్షల మంది ప్యాసింజర్లు ఇప్పుడు ఢిల్లీ మెట్రో ఎక్కకుండా వేరే రూట్ చూసుకున్నరు. సెప్టెంబర్ ల 27.4 లక్షల మంది మెట్రో ఎక్కితే, రేట్లు పెంచినంక అక్టోబర్ ల 24.2 లక్షల మంది మాత్రమే ఎక్కిన్రు. ఓ పెద్దమనిషి RTI కింద అడిగితే ఈ లెక్కలను ఢిల్లీ మెట్రోనే ఇచ్చింది. వీటిని చూసినంకైనా మన హైదరాబాద్ మెట్రో వాళ్లు రేట్లను తక్కువగనే పెట్టాలె.