నవంబర్ 28న మెట్రో! - MicTv.in - Telugu News
mictv telugu

నవంబర్ 28న మెట్రో!

September 7, 2017

హమ్మ ఇగస్తది అగస్తది  అని చాలా రోజుల నుంచి ఓపికతోని ఎదురు చూస్తున్నరు గదా హైదరాబాద్ మెట్రో రైలు గురించి. ఇగ మెట్రో రైలు పట్టాలెక్కనీకి  ముహుర్తం ఖరారైంది,  రైలెక్కనీకి మీరు గుడ  తయ్యారుగుండున్రి. తొలి దశలనైతె నాగోల్ నుంచి మియాపూర్  పట్టాలమీద  మెట్రో పరుగు పెట్టవోతుంది. నవంబర్ 28 నాడు  మంచి ముహూర్తం ఉన్నదని  ఆరోజు  మొదలు వెట్టవోతున్రు. మన ప్రధానమంత్రి  నరేంద్రమోడి  పచ్చ జెండా  ఊపి  మెట్రో రైలును ప్రారంభిస్తడట. ఈ విషయంమీద  ముఖ్యమంత్రి  కేసీఆర్ మోడీకి  ఉత్తరంగుడ రాసిండు. ఆ లెటర్ ను ఐటి మంత్రి కేటీఆర్  తన ట్విట్టర్ల లో పెట్టిండు. ఇగ నవంబర్ 28 నాడు  మెట్రో మొదలు కాంగనే  నాగోల్ నుంచి  మియాపూర్  దాకా ట్రాఫిక్  కష్టాలు లేకుంట ప్రయాణించవచ్చన్నమాట. కనీ  అయ్యా ఆఫీసర్లు  అన్ని  ఇంజన్లు బరాబర్ నడుస్తున్నయా ముందుగాళ్లే  ఒకటికి రొండు మాట్ల  చెకింగ్ జేస్తే మంచిది. ఎందుకంటే  గ లక్నోల గుడ  మెట్రో రైలు షురూ అయిన రోజే  అందరు ఎక్కి కుసోంగనే మొరాయించింది. వందల మంది  కొన్ని గంటలు అన్లనే ఇర్కపోయిన్రు. ముందు జాగ్రత్తగా ఉంటరని  ముందే జెప్తున్నం.