రోడ్డు మధ్యలో మొక్కలు నాటి.. గుంతలు అందుకేనా! - MicTv.in - Telugu News
mictv telugu

రోడ్డు మధ్యలో మొక్కలు నాటి.. గుంతలు అందుకేనా!

November 18, 2019

Hydarabad youth protested against officials by planting trees in potholes

హైదరాబాద్‌లో రోడ్లపై ఉన్న గుంతలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. అడుగడుగునా ఉన్న గుంతలు వాహనాలను, వాహనదారుల ఆరోగ్యాలను దెబ్బతీస్తున్నాయి. గుంతలతో విసికిపోయిన కొందరు యువకులు రోడ్లపై ఉన్న గుంతల్లో మొక్కలు నాటి నీళ్లు పోశారు. గుంతల మయమైన రోడ్డు మరమ్మతుకు నోచుకోకపోవడంతో అధికారులపై ఇలా నిరసన తెలిపారు. 

ఉప్పల్ పరిధిలోని ఫీర్జాదిగూడలో హైదరాబాద్-వరంగల్ హైవేపై కొందరు యువకులు చేపట్టిన ఈ నిరసన కార్యక్రమం స్థానికుల దృష్టిని ఆకర్షించింది. అధికారుల తీరుతో విసుగు చెంది ఈ దారి ఎంచుకున్నామని.. రోడ్డు దెబ్బతినడంతో కొంత కాలంగా తీవ్ర అవస్థలు పడుతున్నట్లు వారిలో ఒకరైన ప్రశాంత్ తెలిపాడు. సెప్టెంబర్ నుంచి అధికారులను ఎన్నోసార్లు కలిసి రహదారి మరమ్మతు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపాడు. వర్షాకాలం ముగిసిపోయినా.. రోడ్లకు మరమ్మతులు చేయడంలేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రశాంత్‌తో పాటు మరో ఇద్దరు యువకులు, ఓ యువతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.