హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్న అబిడ్స్‌లోని చర్మాస్ వస్త్రదుకాణంలో అగ్నికీలలు చెలరేగాయి. నాల్గవ అంతస్తు నుంచి భారీగా మంటలు వస్తున్నాయి. షాపులోని ఉద్యోగులు, పక్క షాపుల వారు భయాందోళనతో బయటకి పరుగులు తీశారు. షాట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం సంభవించి ఉండవచ్చని అనుమానిస్తున్నాయి. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. భారీ ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఏడాది కిందట అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతంలోని తిరిగి అగ్నికీలలు లేచాయి.