స్వీడన్ అమ్మాయితో హైదరాబాదీ పెళ్లి - MicTv.in - Telugu News
mictv telugu

స్వీడన్ అమ్మాయితో హైదరాబాదీ పెళ్లి

October 25, 2019

Hyderabad .

ప్రేమ కులం, మతం, దేశం చూడదు. ఇద్దరి మనసులు కలిస్తే చాలు. తాజాగా హైదరాబాద్‌లోని మల్కాజిగిరికి చెందిన అబ్బాయి, స్వీడన్ అమ్మాయి వివాహ బంధంతో ఒక్కటవ్వడం ఇందుకు చక్కని ఉదాహరణ. 

తూర్పు ఆనంద్‌బాగ్‌ డివిజన్‌లోని తాళ్లబస్తీకి చెందిన అజయ్ స్వీడన్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. తన సహోద్యోగి అయిన పెట్రాతో ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. విషయం తెలిసిన అజయ్ తల్లిదండ్రులు పెళ్లికి వీరి పెళ్ళికి ఒకే చెప్పారు. దీంతో పెట్రాతో కలిసి అజయ్ హైదరాబాద్ వచ్చాడు. గురువారం తార్నాక రైల్వే ఆఫీసర్స్ క్లబ్‌లో భారతీయ సంప్రదాయంలో వైభవంగా వీరి వివాహం జరిగింది. ఈ పెళ్ళికి అజయ్ బంధువులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు పెద్ద ఎత్తున హాజరై వధూవరులను ఆశీర్వదించారు.