బోణీ కొట్టిన హైదరాబాద్.. ఓడిన చైన్నై - MicTv.in - Telugu News
mictv telugu

బోణీ కొట్టిన హైదరాబాద్.. ఓడిన చైన్నై

April 9, 2022

cricket

ఐపీఎల్ 15వ సీజన్ మ్యాచ్‌లు క్రికెట్ అభిమానుల అంచనాలను తారుమారు చేస్తున్నాయి. ఈ మ్యాచ్ గెలవదు అనే టైంలో ఆటగాళ్లు రెచ్చిపోయి, సరైన భారీ షాట్స్ కొడుతూ, విజయం దిశగా పరుగులు పెట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్, చెన్నైల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ముందుగా టాస్ నెగ్గిన హైదరాబాద్..ఫీల్డింగ్ ఎంచుకుంది. బరిలోకి దిగిన చైన్నై నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి, 154 పరుగులు చేసింది. హైదరాబాద్ ముందు 155 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

ఈ నేపథ్యంలో చెన్నై బ్యాటర్లలో మొయిన్ అలీ (48 : 35 బంతుల్లో 3×4, 2×6),అంబటి రాయుడు (27) కీలక ఇన్నింగ్సులు ఆడారు. కెప్టెన్ రవీంద్ర జడేజా (23), ఓ పెనర్లు రాబిన్ ఉతప్ప (15), రుతురాజ్ గైక్వాడ్ (16) పరుగులు చేశారు. శివమ్ దూబె (3), ధోని (3) నిరాశ పరిచారు. బ్రావో (8), క్రిస్ జోర్డాన్ (6) నాటౌట్‌గా నిలిచారు. హైదరాబాద్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, టి. నటరాజన్ రెండేసి, మార్కో జాన్ సెన్, మాడ్రమ్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్.. 17.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించి చెన్నైకి షాక్ ఇచ్చింది. ఓపెనర్లు విలియమ్స‌న్ (32), అభిషేక్ శర్మ (75) బౌలర్లకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా చెలరేగిపోయారు. రాహుల్ త్రిపాఠి(39*) కూడా రాణించాడు. చెన్నై బౌలర్లలో ముకేశ్ చౌదరి, బ్రావో తలో వికెట్ పడగొట్టారు.